Election Commission Serious on Violence in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీ ఎన్నికల్లో సీఎస్ డీజీపీల పనితీరుపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు పడింది. వీరందరిపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది ఈసీ. అలాగే పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలకు సంబంధించిన 12 మంది పోలీసు అధికారులపై వేటు పడింది.
ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ అంశంపై దర్యాప్తు చేసి ఒక్కో కేసుకు సంబంధించి తీసుకున్న చర్యలపై రెండు రోజుల్లో కమిషన్‌కు నివేదిక సమర్పించాలని ఈసీ కోరింది.
Also Read: CEO Report to EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి చేరిన నివేదిక!
ఎన్నికల తర్వాత జరిగిన హింసాకాండపై భౌతికంగా హాజరయ్యి వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఎస్, డీజీపీని ఆదేశించింది. దీంతో వారు ఈ సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఏపీ పోలీస్ అధికారులపై ఉక్కుపాదం మోపింది ఈసీ.
Also Read: AP Govt. to form SIT: ఏపీలో చెలరేగిన అల్లర్లపై సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..!
ఏపీ పోలీస్ అధికారులపై సీఈసీ సీరియస్
పల్నాడు కలెక్టర్‌పై బదిలీ వేటు
పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు
పల్నాడు, అనంతపురం, తిరుపతిలోని 12 మంది పోలీస్ అధికారుల సస్పెన్షన్
ప్రతి ఒక్క అధికారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశం
SITని ఏర్పాటుచేసి ఎలాంటి చర్యలు తీసుకున్నారో రెండు… pic.twitter.com/4jaujW68zb
— BIG TV Breaking News (@bigtvtelugu) May 16, 2024