BigTV English

Syed Mustafa Speech in Pak Parliament: భారత్ చంద్రుడిపైకి వెళ్లి చరిత్ర సృష్టిస్తే.. మనం మాత్రం.. పాక్ నేత స్పీచ్ వైరల్..!

Syed Mustafa Speech in Pak Parliament: భారత్ చంద్రుడిపైకి వెళ్లి చరిత్ర సృష్టిస్తే.. మనం మాత్రం.. పాక్ నేత స్పీచ్ వైరల్..!

Syed Mustafa Speech in Pakistan Parliament Gone Viral: పాక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడి ప్రజల ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దుర్బరంగా మారింది. దీంతో అక్కడి నేతలే ప్రభుత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ సాధించిన విజయాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే బుధవారం పాక్ ఏంపీ సయ్యద్ ముస్తఫా కమల్ భారత్ చంద్రయాన్-3 సహా విజయం సాధించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ అక్కడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ఇందుకు సంబంంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


బుధవారం సయ్యద్ ముస్తఫా పార్లమెంట్ లో ప్రసంగిస్తూ..ప్రస్తుతం కరాచీలో పరిస్థితి ఎలా ఉందంటే భారత్ చంద్రుడిపైకి వెళుతుంటే కరాచీలో పిల్లలు మురికి కాలువలో పడి చనిపోతున్నారని అన్నారు. కరాచీలో తాగేందుకు స్వచ్ఛమైన నీరు దొరకని పరిస్థితి ఉందని చెప్పారు. 70 లక్షల మంది పిల్లలు స్కూళ్లకు దూరంగా ఉన్నారని వాపోయారు. పాకిస్థాన్ వ్యాప్తంగా 2.6 కోట్ల మంది చిన్నారులు స్కూళ్లకు దూరంగా ఉన్నారనే..నివేదికలను ఈ సందర్భంగా ఆయన వివరించారు.

దేశానికి కరాచీ ప్రధాన వనరు అని ముస్తఫా కమల్ అన్నారు. కానీ కరాచీలో చిన్నారులు కాలువలో పడి మరణించినట్లు వార్తలు వస్తుయని పేర్కొన్నారు. దేశంలో రెండు ఓడరేవులు ఉండగా.. ఆ రెండు కరాచీలోనే ఉన్నాయని చెప్పారు. కానీ కరాచీకి 15 ఏళ్లుగా పరిశుభ్రమైన మంచి నీరు అందడం లేదని తెలిపారు. కరాచీ సింధు ప్రావిన్స్ రాజధాని అని 48 వేల పాఠశాలలు స్థానికంగా ఉన్నాయని అన్నారు.


Also Read: ‘పీఓకే భారత్‌లో అంతర్భాగమే.. కొంతమంది బలహీనత వల్లే చేజారింది’

చదువుకోని పిల్లల వల్ల దేశ ఆర్థిక అభివృద్ధి నాశనం అవుతుందని వెల్లడించారు. అయితే ఈ సందర్భంగానే మౌలానా ఫజ్లుర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. భారత్, పాక్ కలిసి స్వాతంత్ర్యం పొందాయని కానీ.. భారత్ అగ్రరాజ్యంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటే తాము మాత్రం కలలు కంటున్నామని అన్నారు. ఈ క్రమంలోనే ముస్తఫా కమల్ భారత్ పై ప్రశంసలు కురిపించారు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×