Big Stories

Another shock to Jagan: జగన్‌కు దెబ్బ మీద దెబ్బ!

ఎన్నికల వేళ సీఎం జగన్‌కు ఊహించని దెబ్బలు తగులుతున్నాయి. వైసీపీ వ్యవహారశైలిపై ప్రతీరోజూ ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి వెళ్తున్నాయి. ఇప్పటికే చాలామంది అధికారులపై వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మరికొందరిని వేరు ప్రాంతానికి పంపించింది. అయినా ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతు న్నాయి. ఈ క్రమంలో మరికొందరి అధికారులపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈసారి ప్రభుత్వ సలహాదారుల వంతైంది.

- Advertisement -

ఏపీ ప్రభుత్వ సలహాదారులపై ఈసీకి భారీగా ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో నియమించిన సలహాదారులు.. పార్టీ నేతల మాదిరిగా మీడియాతో మాట్లాడడం, ప్రెస్‌మీట్లు పెట్టి విపక్షాలపై విరుచుకుపడడం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అయితే వాళ్లపై రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో తర్జనభర్జన పడింది. ఈ క్రమంలో కన్నెర్ర చేసింది ఈసీ. అంతేకాదు ఓ కీలక ప్రకటన వెలువడింది.

- Advertisement -
CM Jagan
CM Jagan

ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చేసింది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి జీతభత్యాలు పొందడమేకాకుండా, కేబినేట్ స్థాయి హోదాను అనుభవిస్తున్నారు. ప్రభుత్వ నుంచి జీతాలు పొందుతున్న 40 మందికి ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఈసీ వివరించింది. ఈ మేరకు ఈసీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు వెళ్లాయి. విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్న సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని, ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సున్నితంగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ALSO READ: నేతలతో జగన్ చర్చ, ఆయన్ని ఏం చేద్దాం..!

ఈ జాబితాలో మొదట ఉన్నది సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ నేతల కంటే ముందుగా ఆయనే విపక్షాలకు కౌంటర్లు ఇస్తుంటారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా పలుమార్లు మీడియా ముందుకొచ్చారు. కూటమి నేతలపై మండిపడ్డారు కూడా. ఈ పరిణామాలను టీడీపీ తనకు అనుకూలంగా మలచుకుని సజ్జల నుంచి వాయిస్ రాకుండా కట్టడి చేసింది. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని పరిణామాలు జరుగు తాయోనని చర్చించుకుంటున్నారు ఆ పార్టీ నేతలు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News