BigTV English

ED Chargesheet On JC Prabhakar Reddy: బీఎస్-4 వాహనాల కోనుగోళ్లలో అక్రమాలు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ ఛార్జ్‌షీట్

ED Chargesheet On JC Prabhakar Reddy: బీఎస్-4 వాహనాల కోనుగోళ్లలో అక్రమాలు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ ఛార్జ్‌షీట్

ED Chargesheet On JC Prabhakar Reddy: బీఎస్-IV వాహనాల మనీ లాండరింగ్‌ స్కామ్‌ కేసులో TDP నేత JC ప్రభాకర్‌ రెడ్డిపై ED ఛార్జ్‌షీట్ ఫైల్‌ చేసింది. హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులు, సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది. BS-4 నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాలను ఏప్రిల్ 1, 2017 నుంచి భారతదేశంలో విక్రయించరాదని.. రిజిస్ట్రేషన్ చేయకూడదని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించింది.


అయినప్పటికీ, JC ప్రభాకర్ రెడ్డి, C. గోపాల్ రెడ్డితో పాటు పలువురు వ్యక్తులు అశోక్ లీలాండ్ లిమిటెడ్ నుండి BS-3 వాహనాలను జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, C. గోపాల్ రెడ్డి అండ్ కో పేరుతో భారీ తగ్గింపుతో కొనుగోలు చేసి, మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

నకిలీ పత్రాల ఆధారంగా BS-4 వాహనాలుగా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని EC ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అక్రమ రిజిస్ట్రేషన్లలో ఎక్కువ భాగం నాగాలాండ్‌లో జరుగగా, కొన్ని కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరిగాయని తెలిపింది.


జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 50 వాహనాలు, సి.గోపాల్ రెడ్డి పేరిట 104 వాహనాలు రిజిస్టర్ అయినట్లు ఈడీ విచారణలో తేలింది. ఈ వాహనాల్లో చాలా వరకు వాటిని BS-4 వాహనాలుగా ఉపయోగించడం ద్వారా వారి రవాణా వ్యాపారంలో వారు మరింత ఉపయోగించుకున్నారు.

అలాంటి కొన్ని వాహనాలను BS-4 వాహనాలుగా చూపి విక్రయించారు. ఈ వాహనాలను సొంతం చేసుకోవడం, నడపడం, విక్రయించడం ద్వారా 38 కోట్ల రూపాయలు ఆర్జించారని పేర్కొంది ED.

Also Read: తాడిపత్రిలో హైటెన్షన్.. పెద్దారెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డి.. సీఐకి గాయాలు

అంతకుముందు, జేసీ ప్రభాకర్ రెడ్డి, సీ గోపాల్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు చెందిన 68 కోట్ల చరాస్తులు.. 28.6 కోట్ల రూపాయల స్థిరాస్తులను ED అటాచ్ చేసింది.

Tags

Related News

APSRTC employees: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ప్రమోషన్స్ పండుగ వచ్చేసింది!

Mega Projects in AP: ఏపీకి భారీ పెట్టుబడి.. అన్ని కోట్లు అనుకోవద్దు.. జాబ్స్ కూడా ఫుల్!

Vinayaka Chavithi 2025: దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన మట్టి గణేష్ విగ్రహం.. దర్శిస్తే కలిగే భాగ్యం ఇదే!

Heavy Rain Andhra: ఏపీకి భారీ వర్షసూచన.. రాబోయే 48 గంటలు కీలకం.. అప్రమత్తం అంటూ హెచ్చరిక!

Auto drivers: బస్సులో బిక్షాటన చేసిన ఆటో డ్రైవర్లు.. రోడ్డున పడ్డామంటూ ఆవేదన

Bhumana Vs Srilakshmi: రూటు మార్చిన వైసీపీ.. టార్గెట్ ఐఏఎస్ శ్రీలక్ష్మి, చీరలు-విగ్గుల ఖర్చెంత?

Big Stories

×