BigTV English

ED raids on Rayapati: రాయపాటి కంపెనీ మనీలాండరింగ్.. ఈడీ అటాక్..

ED raids on Rayapati: రాయపాటి కంపెనీ మనీలాండరింగ్.. ఈడీ అటాక్..
Rayapati sambasiva rao news

Rayapati Sambasiva rao news(Breaking news in Andhra Pradesh) : టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు లక్ష్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ దాడులు చేపట్టింది. హైదరాబాద్ తో పాటు గుంటూరులోని ఆయనతో పాటు సంబంధిత కంపెనీ డైరెక్టర్ల.. ఇళ్లు, కార్యాలయాలపై మంగళవారం ఉదయం నుంచే ప్రత్యేక బృందాలు సోదాలు జరుపుతున్నాయి.


ట్రాన్స్‌స్టాయ్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. బ్యాంకు రుణాల ఎగవేత అంశంపై గతంలో మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. కేసు విచారణలో భాగంగానే రాయపాటి నివాసంలో తనిఖీలు చేపట్టారు అధికారులు. హైదరాబాద్, గుంటూరు సహా తొమ్మిది చోట్ల సోదాలు నిర్వహించామని.. రాయపాటి, ఇతర ప్రమోటర్ల కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు జరిగాయని ఈడీ అధికారులు ప్రకటించారు.

టీడీపీ హయాంలో మొదట పోలవరం ప్రాజెక్ట్ పనులు చేసింది రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీయే. ఆ తర్వాత కాంట్రాక్టర్‌ను మార్చేశారు. ప్రస్తుతం రాయపాటి సాంబశివరావు టీడీపీలోనే కొనసాగుతున్నారు.


మరోవైపు హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో ఈడీ దాడులు జరుపుతోంది. మాలినేని సాంబశివరావుతో పాటు పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×