BigTV English

YS Sharmila: ప్రజలు ఓట్లేస్తే గెలవలేదా ?.. ఓట్లు వేసి గెలిపించింది హత్యలు చేయించడానికా?: వైఎస్ షర్మిల

YS Sharmila: ప్రజలు ఓట్లేస్తే గెలవలేదా ?.. ఓట్లు వేసి గెలిపించింది హత్యలు చేయించడానికా?: వైఎస్ షర్మిల

YS SharmilaYS Sharmila: వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా దౌర్జన్యాలు, అక్రమాలే కనిపిస్తున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నాసరే నిందుతులను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.


తన చిన్నాన వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితులపై చర్యలు తీసుకోకపోవడం వల్ల యథేచ్చగా వారు బయట తిరుగుతున్నారని వీటిన్నంటికి కారణం వైసీపీ ప్రభుత్వం వారికి అండగా నిలబడడమేనని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. వైఎస్సార్ జిల్లా పెండిమర్రి మండలం నందిమండలం గ్రామంలో నిర్విహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.

వివేకాను చంపిన నిందితుడికే కడపలో సీఎం జగన్ టికెట్ కేటాయించారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఒకవైపు వైఎస్ బిడ్డ, మరోవైపు వివేకాను హత్య చేసిన నిందితుడు పోటీ చేస్తున్నారని తెలిపారు. యాదవపురంలో శ్రీనివాస్ యావద్ అనే వ్యక్తిని కూడా అవినాష్ రాళ్లతో కొట్టి చంపించేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు.


“పెండ్లిమర్రి మండలం యాదవపురం గ్రామంలో శ్రీనివాస్ యాదవ్ కుటుంబాన్ని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు. భూమి కోసం ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి అనుచరులు హత్య చేసారు. రాళ్లతో కొట్టి దారుణంగా చంపేశారని చెప్తున్నారు. వాళ్ళ తమ్ముడిని ట్రాక్టర్‌తో తొక్కించాలని చూశారు. పోలీసులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. చంపాలని చూసిన వాళ్ళపై ఎటువంటి చర్యలు లేవు. నిందితులు స్థానిక ఎమ్మెల్యే , ఎంపీ అనుచరులు కావటమే దీనికి కారణం. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీలు ప్రజలు ఒట్లేస్తే గెలవలేదా ?.. ఓట్లు వేసి గెలిపించింది హత్యలు చేయించడానికా? తక్షణమే నిందితులను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి” అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Also Read: EC Notice To CM Jagan: సీఎం జగన్‌కు ఈసీ నోటీసు..

నిందితులంతా స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అనుచరులేనని.. అందుకే వారిని పోలీసులు కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది హత్యలు చేయడానికా అని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో శంకుస్థాపన తప్ప ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం లేదని.. స్టీల ప్లాంట్ పూర్తి అయితే వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని పేర్కొన్నారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×