Elections Commission Serious on YSRCP MLA A Sivakumar: తెనాలి వైసీపీ ఎమ్మెల్యేపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శివకుమార్ ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ గృహ నిర్బంధంలో ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే శివ కుమార్ పోలింగ్ బూత్ లోకి క్యూలో వెళ్లకుండా నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న ఓటర్లు ఆయనను నిలదీశారు. వెంటనే కోపంతో ఎమ్మెల్యే ఓ ఓటరుపై చేయి చేసుకోగా..బాధిత ఓటరు కూడా ఎమ్మెల్యే శివ కుమార్ ను తిరిగి కొట్టాడు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు ఓటరుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. అనేక ప్రాంతాల్లో వైసీపీ నేతలు..టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు. దీంతో చివరి గంటల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ ఫోకస్ పెంచింది.
తెనాలి, పుంగనూరు సంఘటనలను ఖండించిన ఈసీ వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించింది. పోలింగ్ బూత్ ఆక్రమణ , ఘర్షణలు జరగకుండా చూడాలని తెలిపింది.
ఎమ్మెల్యే అయితే ఏంటి..? ప్రతి ఒక్కరూ పద్ధతి ఫాలో కావాలి
తెనాలి ఎమ్మెల్యే దాడిలో గాయపడ్డ సుధాకర్ మాటలు..#APElections2024 #Guntur #YSRCP #NewsUpdates #bigtvlive@YSRCParty https://t.co/waCyQlBaA9 pic.twitter.com/GCo4C8609k— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2024