BigTV English

IPL 2024 Playoffs Scenario: 12 లో ముగ్గురు, 14లో ఇద్దరు.. ఐపీఎల్ లో ప్లే ఆఫ్ కి వెళ్లేదెవరు..?

IPL 2024 Playoffs Scenario: 12 లో ముగ్గురు, 14లో ఇద్దరు.. ఐపీఎల్ లో ప్లే ఆఫ్ కి వెళ్లేదెవరు..?

IPL 2024 Playoffs Scenario: కంగారుపడకండి.. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో మన జట్ల స్థితి ఇది. ప్లే ఆఫ్ కి నాలుగు జట్లు వెళతాయి. ఆల్రడీ కోల్ కతా 18 పాయింట్లతో ఫస్ట్ కర్చీఫ్ వేసేసింది. తర్వాత రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో కొంచెం సేఫ్ జోన్ లో ఉందికానీ వరుసపెట్టి మూడు మ్యాచ్ లు ఓడిపోయి, తిరోగమనంలో ఉంది.


ఇంకా జట్టు ఆడాల్సిన మ్యాచ్ లు రెండే ఉన్నాయి. ఒకవేళ అద్రష్టవశాత్తూ అందులో ఒకటి గెలిచినా కోల్ కతా తో కలిసి ప్లే ఆఫ్ కి అఫీషియల్ గా వెళుతుంది. ఇక్కడ రెండు జట్లు ఇలా వెళ్లాక మిగిలిన రెండు జట్లకోసం ఇప్పుడు ఆసక్తికర ఫైట్ నడుస్తోంది. అదేమిటంటే ఇప్పుడు 14 పాయింట్లతో హైదరాబాద్, చెన్నై ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే హైదరాబాద్ ఆడాల్సినవి ఇంకా రెండు ఉన్నాయి.

అందులో ఒకటి గెలిచినా 16 పాయింట్లతో కొంచెం ఊపిరి తీసుకుంటుంది. రెండూ గెలిస్తే అసలు సమస్యే లేదు. 18 పాయింట్లతో ప్లే ఆఫ్ కి చేరిపోతుంది.


Also Read: IPL 2024 DC vs LSG Match Preview: ఢిల్లీ గెలుస్తుందా? నిలుస్తుందా..? నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్..!

చెన్నై విషయానికి వస్తే 14 పాయింట్లతో ఉంది. తనిప్పుడు గెలవక తప్పని పరిస్థితిలో ఉంది. అలా గెలిస్తే కనీసం 16 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్ లోకి వెళతుంది. అప్పుడు రాజస్థాన్, చెన్నై, హైదరాబాద్ కూడా 16 పాయింట్లతో ఉంటే, ఈ మూడు కళ్లు మూసుకుని ప్లే ఆఫ్ లో మిగిలిన మూడు బెర్త్ లు తీసుకుంటాయి. ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది.

అదేమిటంటే లక్నో ప్రస్తుతం 12 పాయింట్లతో ఉంది. ఇంకా ఆడాల్సినవి రెండు ఉన్నాయి. ఇవి వరుసగా గెలిస్తే ఆ జట్టు కూడా 16 పాయింట్లతో ఉంటుంది. అప్పుడు ఈ నాలుగు జట్ల మధ్య నెట్ రన్ రేట్ ఆధారంగా తొలి మూడు స్థానాల్లో ఉన్న జట్లు ప్లే ఆఫ్ కి వెళతాయి. ఇదొక సీక్వెన్స్ గా ఉంది.

అలా కాకుండా ఇక్కడేమైనా చిత్రవిచిత్రాలు జరిగితే, ఢిల్లీ ఓడిపోయినట్టు, ఓడిపోతే అప్పుడు చెన్నయ్, హైదరాబాద్, లక్నో కూడా 14 పాయింట్లతో ఉండిపోతాయి.

Also Read: IPL 2024 GT vs KKR: ప్లే ఆఫ్ రేస్ నుంచి గుజరాత్ అవుట్.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు..

అప్పుడు వీటికి తోడు ఆర్సీబీ, ఢిల్లీ చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఇవి రెండూ ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్నాయి. అంతేకాదు ఇవి రెండూ కూడా చెరొక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇప్పుడవి రెండూ గెలిచి, 14 పాయింట్ల వద్దకు వచ్చి ఆగిపోతే, అప్పుడు మొత్తం 5 జట్లు హైదరాబాద్, చెన్నయ్, లక్నో, ఆర్సీబీ, ఢిల్లీ అన్నీ కూడా ఈ సీక్వెన్స్ దగ్గర ఆగిపోతాయి.

ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. అదేమిటంటే ప్రస్తుతం గుజరాత్ 10 పాయింట్లతో ఉంది. అదింకా రెండు మ్యాచ్ లు ఆడాలి. ఇందులో వరుసగా గెలిస్తే అది కూడా 14 పాయింట్లతో, ఈ ఐదు జట్ల సరసన చేరుతుంది. కాకపోతే నెట్ రన్ రేట్ ని పెంచుకుని భారీ విజయాలు సాధిస్తే ఏమో ఏదైనా జరగవచ్చునని సీనియర్స్ అంటున్నారు.

Also Read: గుజరాత్ రేస్ లోకి వస్తుందా?.. నేడు కోల్ కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్

అప్పుడు ఈ ఆరు జట్ల నుంచి రెండు మాత్రమే ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. దాంతో నెట్ రన్ రేట్ ఆధారంగా ఇందులో రెండు ప్లే ఆఫ్ కి వెళతాయి. ఇదీ ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ లో రానున్న రోజుల్లో అభిమానుల ముందున్న టెన్షను.. అంతా కుదిరితే, అన్నీ అనుకున్నట్టు జరిగితే మాత్రం కోల్ కతా, రాజస్థాన్, చెన్నయ్, హైదరాబాద్ నాలుగు ప్లే ఆఫ్ కి చేరే అవకాశాలున్నాయి.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×