E-Paper
Advertisement

యాపిల్ వాచ్ లవర్స్‌కు క్రేజీ అప్‌డేట్.. 6 ఏళ్ల తర్వాత ఆ రాయల్ డిజైన్ మళ్లీ వస్తోంది!

యాపిల్ వాచ్ లవర్స్‌కు క్రేజీ అప్‌డేట్.. 6 ఏళ్ల తర్వాత ఆ రాయల్ డిజైన్ మళ్లీ వస్తోంది!
Advertisement

Apple Watch Series 12: కొన్నేళ్లుగా యాపిల్ వాచ్ మోడల్స్ చూసీ చూసీ ‘అదే లుక్, అదే డిజైన్.. కాస్తైనా మార్పు ఉంటే బాగుండు’ అని అనుకుంటున్నారా? అయితే ఈ అప్‌డేట్ కచ్చితంగా మీ కోసమే. యాపిల్ తమ పాత క్లాసిక్ మేజిక్‌ను మళ్లీ రిపీట్ చేయడానికి రెడీ అవుతోంది. కంపెనీ లైన్‌అప్‌లోనే మోస్ట్ ఎలిగెంట్ అనిపించుకున్న ‘సెరామిక్ ’ వెర్షన్‌ను మళ్లీ రంగంలోకి దించేందుకు యాపిల్ కసరత్తు చేస్తోందట. ప్రసిద్ధ టెక్ అనలిస్ట్ మార్క్ గుర్మాన్ లీక్ చేసిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

సెరామిక్ లుక్ ప్రత్యేకత ఏంటి?

యాపిల్ మొదటిసారిగా సీరీస్ 2 వాచ్‌తో ఈ సెరామిక్ మోడల్‌ను పరిచయం చేసింది. ఆ తర్వాత సీరీస్ 5లో కూడా దీనిని అందించారు. తెల్లటి రాయల్ లుక్‌తో వచ్చే ఈ సెరామిక్ కేసింగ్, సాధారణ స్టెయిన్‌లెస్ స్టీల్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ బలంగా ఉంటుంది. గీతలు పడకుండా, చూడటానికి ఎంతో క్లాసీగా ఉండటం దీని ప్రత్యేకత. అయితే, సీరీస్ 6 లాంచ్ సమయంలో యాపిల్ ఈ మోడల్‌ను నిలిపివేసింది.

Advertisement

Also Read: ఓరి నాయనో.. రూ.57,000 శాంసంగ్ ట్యాబ్ రూ.28,000కే వచ్చేస్తోంది.. ఇదంతా కలా? నిజమా?

ఈసారైనా వస్తుందా?

రాబోయే ‘యాపిల్ వాచ్ సీరీస్ 12’తో ఈ సెరామిక్ ఫినిషింగ్ మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి. ఒకవేళ ఈ ఏడాది కుదరకపోతే 2027 నాటికైనా ఇది కచ్చితంగా మార్కెట్‌లోకి వస్తుందని అంటున్నారు. దాదాపు ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మోడల్ మళ్లీ వస్తుండటంతో, ప్రీమియం డిజైన్లను ఇష్టపడే యాపిల్ అభిమానులు దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది రెగ్యులర్ అల్యూమినియం మోడల్స్ కంటే చాలా డిఫరెంట్‌గా, కాస్ట్లీ లుక్‌తో ఉండనుంది.

కొత్త ఫీచర్లు కూడా..

Advertisement

కేవలం లుక్ మాత్రమే కాకుండా.. పనితీరు విషయంలో కూడా ఈ వాచ్‌లో మంచి మార్పులు ఉండబోతున్నాయి. కొత్త ప్రాసెసర్, మెరుగైన బ్యాటరీ లైఫ్ ఉండేలా యాపిల్ ప్లాన్ చేస్తోంది. దీంతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన కొత్త హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు, విభిన్నమైన బెల్ట్ కలర్స్ కూడా ఈ కొత్త సిరీస్‌లో పరిచయం చేసే అవకాశం ఉంది. డిజైన్, ఫీచర్ల కలయికగా రాబోతున్న ఈ వాచ్ టెక్ ప్రియులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.

Also Read: ధర ఎక్కువైనా వర్త్ అనిపించే ఫీచర్లు.. OnePlus 16లో రాబోతున్న క్రేజీ చేంజెస్ ఇవే!

Tags

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×