E-Paper
Advertisement

వెకేషన్‌లో ప్రియుడు మిస్సింగ్… వెతుకుతూ వెళ్తే అతడి అసలు బండారం బట్టబయలు

వెకేషన్‌లో ప్రియుడు మిస్సింగ్… వెతుకుతూ వెళ్తే అతడి అసలు బండారం బట్టబయలు
Advertisement

Mystery Thriller Series: అమెరికన్ ఆర్కియాలజిస్ట్ ఆలిస్ మన్రో, తన ప్రియుడు టామ్ పార్కర్‌తో కలిసి ఫ్రాన్స్‌కు వెకేషన్‌కు వెళ్తుంది. ఎంతో సంతోషంగా సాగుతున్న వారి ప్రయాణంలో ఊహించని సంఘటన జరగడంతో ఆలిస్ జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది. ఆ తరువాత ఏం జరిగింది అన్నదే ‘వ్యానిష్డ్’ అనే అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ మినీ సిరీస్. బార్నబీ థాంప్సన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో కేలీ కువోకో, సామ్ క్లాఫ్లిన్, మథియాస్ స్విగోఫర్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఈ సిరీస్ ను తెలుగులో ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఆలిస్ మన్రో ఒక ఆర్కియాలజిస్ట్. తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ టామ్ పార్కర్‌తో కలిసి ఫ్రాన్స్‌లో రొమాంటిక్ వెకేషన్‌కు వస్తుంది. ఇద్దరూ కలిసి దక్షిణ ఫ్రాన్స్‌లోని ఆర్లెస్ ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ప్రయాణంలో భాగంగా రైల్లో వెళ్తున్న సమయంలో టామ్ అనూహ్యంగా కనిపించకుండా పోతాడు.

Advertisement

మొదట ఆలిస్ దీనిని ఏదో చిన్న అపార్థంగా భావిస్తుంది. టామ్ ఎక్కడికైనా వెళ్లి ఉంటాడని అనుకుంటుంది. కానీ ఎంతసేపటికీ అతను తిరిగి రాకపోవడంతో ఆమె ఆందోళన మొదలవుతుంది. రైలులో వెతికినా, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రయత్నించినా టామ్ ఆచూకీ మాత్రం దొరకదు. ఇంతకీ అతను ఎక్కడికి వెళ్లాడు? ఎవరైనా అతన్ని కిడ్నాప్ చేశారా? లేక టామ్ తనంతట తానే అదృశ్యమయ్యాడా? అనే ప్రశ్నలతో ఆమె సతమతం అవుతుంది.

స్థానిక పోలీసుల నుంచి ఆశించిన సహాయం పూర్తిగా లభించకపోవడంతో ఆలిస్ స్వయంగా టామ్ కోసం అన్వేషణ మొదలు పెడుతుంది. అయితే ఆమెకు తెలియని విషయం ఏంటంటే, తాను ప్రేమించిన వ్యక్తి గురించి తనకు తెలిసింది చాలా తక్కువ. టామ్ గతాన్ని పరిశీలిస్తున్న కొద్దీ ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలు బయటపడతాయి.

Advertisement

టామ్ నడుపుతున్న ఛారిటీ సంస్థ కూడా ఆలిస్ అనుకున్నట్టుగా ఉండదని తెలుస్తుంది. ఆ సంస్థ వెనుక దాగి ఉన్న సంబంధాలు, టామ్ గత జీవితంలోని రహస్యాలు, అతనితో సంబంధం ఉన్న వ్యక్తులు ఆలిస్ అనుమానాలను మరింత పెంచుతారు. ఒక వెకేషన్‌గా మొదలైన ప్రయాణం క్రమంగా ప్రమాదకరమైన ఇన్వెస్టిగేషన్‌గా మారుతుంది.

అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. టామ్‌ను వెతుకుతున్న కొద్దీ ఆలిస్ కూడా ప్రమాదంలో పడుతుంది. తన ప్రియుడి గురించి నిజం తెలుసుకోవడానికి ఆమె చేసే ప్రయత్నం చివరకు ఆమెను ఒక చీకటి ప్రపంచం దగ్గరకు తీసుకెళ్తుంది. అక్కడ ఆమె నమ్మిన వ్యక్తులపైనే అనుమానం పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇన్నాళ్లు తనకు బాగా తెలుసనుకున్న టామ్ అసలు ఎవరు ? అతని గతంలో దాగి ఉన్న రహస్యం ఏంటి ? అతని అదృశ్యానికి అంతర్జాతీయ స్థాయి కుట్రతో సంబంధం ఉందా ? ఆలిస్‌ను కూడా ఎవరో కావాలనే ఈ వ్యవహారంలోకి లాగారా ? అనే ప్రశ్నలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.

మొత్తం 4 ఎపిసోడ్లతో సాగే ఈ మినీ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ ఆలిస్ దర్యాప్తును మరో స్థాయికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా టామ్ గురించి ఆమె తెలుసుకునే విషయాలు ప్రేక్షకుల్లో కూడా కొత్త అనుమానాలను కలిగిస్తాయి. చివరికి తన ప్రియుడి అసలు రూపాన్ని ఆలిస్ ఎలా తెలుసుకుంది? అతని అదృశ్యం వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు? ఆమె ఆ ప్రమాదం నుంచి బయటపడిందా? అనేది తెలుసుకోవాలంటే సిరీస్‌ను పూర్తిగా చూడాల్సిందే.

తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో

ఈ సిరీస్ ప్రస్తుతం భారతదేశంలో Lionsgate Playలో అందుబాటులో ఉంది. Airtel Xstream Play ద్వారా కూడా ఈ సిరీస్‌ను చూడవచ్చు. తెలుగు సహా ప్రాంతీయ భాషల డబ్బింగ్‌తో అందుబాటులోకి రావడం వల్ల తెలుగు ఓటీటీ ప్రేక్షకులు ఈ థ్రిల్లర్ ను చూసి ఎంజాయ్ చేయవచ్చు. ప్రేమకథతో మొదలై, మిస్సింగ్ కేసుగా మారి… చివరకు అంతర్జాతీయ కుట్ర వరకు వెళ్లే ఈ సస్పెన్స్ థ్రిల్లర్లు మంచి వీకెండ్ వాచ్ అవుతుంది.

Read Also : రిటైర్ అయ్యాక ఇంట్లో నరకం చూపించాడు… కోడలు ఇచ్చిన ట్రీట్‌మెంట్ చూస్తే నవ్వాపుకోలేరు

Related News

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

ఇంట్లో గది అద్దెకు ఇస్తే ఇదేం రచ్చ భయ్యా… మళ్లీ మొదలైన నవ్వుల హంగామా

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×