E-Paper
Advertisement

Shocking News: బ్రేకింగ్ న్యూస్.. జగన్‌కు భారీ షాక్.. ఇప్పుడు ఆయన ఎలా స్పందిస్తారో..?

Shocking News: బ్రేకింగ్ న్యూస్.. జగన్‌కు భారీ షాక్.. ఇప్పుడు ఆయన ఎలా స్పందిస్తారో..?
Advertisement

Shocking News for Jagan: ఏపీలోనూ ఏలూరులో వైసీపీ పార్టీకి భారీ షాక్ ఎదురైంది. వైసీపీకి చెందిన కీలక వ్యక్తులు టీడీపీలో చేరారు. ఏలూరు నగర మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో వారు టీడీపీలో చేరారు. వీరితోపాటు పలువురు కీలక నేతలు కూడా టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని తన నివాసంలో వీరికి మంత్రి లోకేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

TDP
TDP

Also Read: అదంతా సైకో వైసీపీ బ్యాచ్ పనే.. మంత్రి నారా లోకేశ్ కౌంటర్

Advertisement

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ ఇంకా గుణపాఠం నేర్చుకోవడంలేదన్నారు. పైగా ప్రజా ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక దుష్ర్పచారం చేస్తూ పబ్బం గడుపుకుంటుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తమ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తదంటూ మంత్రి స్పష్టం చేశారు. ఏలూరు అభివృద్ధి కోసం కలిసి వచ్చేవారికి స్నేహ హస్తం అందిస్తామంటూ టీడీపీ ఎమ్మెల్యే బడేటి అన్నారు. ఆళ్ల నాని వైసీపీ కార్యకర్తలను వదిలేసి పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారంటూ ఆయన ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేవారిని టీడీపీలో చేర్చుకుంటామంటూ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అదేవిధంగా త్వరలోనే కార్పొరేటర్లుగా కూడా దశలవారీగా టీడీపీలో చేరుతారన్నారు.

Also Read: గలీజ్ వాటర్ లో ప్లేట్లు కడగింది నిజమేనా? బిగ్ టీవీ ఫ్యాక్ట్ చెక్‌లో బ‌య‌ట‌ప‌డ్డ నిజాలు

Advertisement

అనంతరం ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా గతంలో తాము టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. అయితే, ఆ పార్టీలోకి వెళ్లాక ఏ మాత్రం అభివృద్ధి చేయలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 40 మంది కార్పొరేటర్లు టీడీపీ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారంటూ మేయర్ చెప్పారు.

Tags

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×