EO on Recommendation Letters: తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల విషయంలో.. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో వెల్లడించారు. అలానే తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలపై కూడా ఈవో రెస్పాండ్ అయ్యారు. లీగల్ ఒపీనియన్ అడిగామని.. అది వచ్చిన తర్వాత కచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
భక్తుల వద్ద నుంచి సలహాలు, ఫిర్యాదులు స్వీకరించిన టీటీడీ(TTD) ఈవో.. శ్రీవారి దర్శనానికి తెలంగాణ నేతల నుంచి వచ్చే సిఫార్సు లేఖలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తగిన ఏర్పాటు చేశామన్నారు. సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేశామని ఈవో శ్యామల రావు తెలిపారు. వైకుంఠ ఏకాదశికి జనవరి10-20వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనము ఉంటుందని తెలిపారు. వైకుంఠ ఏకాదశి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్ల విక్రయాలు అన్‌లైన్‌లో1,40000లో జరిగాయని వెల్లడించారు. ఎఎస్ ఎడి టోకన్లు తిరుపతి, తిరుమలలో 8కేంద్రాలలో 7వతేది నుంచి ఇస్తామని తెలిపారు.
Also Read: జగన్‌ను బిగ్ షాక్.. మరో నేత రాజీనామా
ఇక నవంబర్ నెలలో తిరుమల లో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సంఖ్య.. 20,3500 మంది. హుండీ అదాయం.. 113కోట్లు. లడ్డూ విక్రయాలు.. 97లక్షలు. అమ్మ వారి ప్రసాదం స్వీకరించి భక్తులు సంఖ్య.. 19,74000. తలానీలాలు సమర్పించిన భక్తులు..7,31000.
ఇటీవల శ్రీవారి దర్శనానికి తెలంగాణ నేతల నుంచి వచ్చే సిఫార్సు లేఖలను కూడా పరిగణలోకి తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో వారానికి రెండు రోజులు తెలంగాణ నేతలు శ్రీవారి దర్శనానికి ఎవరికైనా లేఖలు ఇచ్చి పంపించవచ్చు. అనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే ఈ నిర్ణయాన్ని టీటీడీ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది.