Nitish Kumar Reddy: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) దుమ్ములేపుతున్నాడు. టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ…. పెవిలియన్ బాట పడితే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) మాత్రం… సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 171 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ సెంచరీ పూర్తి చేసుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ). కాసేపటి క్రితమే తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఈ తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి.
Also Read: Pro Kabaddi Final: ఫైనల్ బరిలో పట్నా, హరియాణా..టైమింగ్స్, ఫ్రీగా ఎలా చూడాలంటే !
అయితే ఈ మ్యాచ్ కు… తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఇక నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) ఫోర్ కొట్టి సెంచరీ చేసుకోవడంతో… నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి ( Nitish Kumar Reddy Father )ఎమోషనల్ అయ్యాడు. జనాల మధ్య కూర్చున్న ఆయన… కొడుకు సెంచరీని చూసి కన్నీటి పర్యవంతమయ్యారు నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి. అంతేకాదు.. తాము నమ్ముకున్న దేవుడికి నమస్కారం కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: IND vs AUS: మైదానంలో కండోమ్ బెలూన్ కలకలం.. వీడియో వైరల్
ఇది ఇలా ఉండగా… టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య…. నాలుగో టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ మూడవరోజు జరుగుతుంది. అయితే రెండో రోజుకి ఐదు వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఓవర్ నైట్ స్కోర్ తో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియాను నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) ఆదుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి తో పాటు వాషింగ్టన్ సుందర్… టీమ్ ఇండియా ఇన్నింగ్స్ చక్క దిద్దారు.
నితీష్ కుమార్ ( Nitish Kumar Reddy ) సెంచరీ చేసుకోగా వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సరిగ్గా 167 బంతుల్లో 50 పరుగులు చేసి వికెట్ పోగొట్టుకున్నాడు వాషింగ్టన్ సుందర్. ఇక వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) తర్వాత…. అదే ఊపును కొనసాగిస్తున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. మూడవ రోజు ఆట మూసి సమయానికి 116 ఓవర్లు ఆడింది టీం ఇండియా. ఈ నేపథ్యంలోనే తొమ్మిది వికెట్లు నష్టపోయి 358 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కంటే మరో 116 పరుగులు వెనుకబడి ఉంది టీమిండియా. అయితే…. నితీష్ కుమార్ ( Nitish Kumar Reddy ) సెంచరీ చేసుకున్న తర్వాత.. కాస్త వర్షం పడింది. అలాగే.. బ్యాడ్ లైట్ కూడా నెలకొంది. ఈ కారణాల నేపథ్యంలోనే… కాస్త ముందుగానే… మూడో రోజు ముగించారు.
Nitish Kumar Reddy hits his maiden Test century and receives a standing ovation from the MCG crowd ❤️ #AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/Vbqq5C26gz
— cricket.com.au (@cricketcomau) December 28, 2024