BigTV English

Perni nani: సొంత పార్టీ నేతపై పేర్ని నాని సెటైర్లు.. వైసీపీలో ఇంటర్నల్ వార్

Perni nani: సొంత పార్టీ నేతపై పేర్ని నాని సెటైర్లు.. వైసీపీలో ఇంటర్నల్ వార్

వైసీపీలో ఇంటర్నల్ వార్ జరుగుతోందా..? ఒకరంటే ఒకరికి పడటంలేదా..? ఇప్పటి వరకూ సజ్జల రామకృష్ణారెడ్డిపై కొంతమంది నేతలు గుర్రుగా ఉన్నారనే విషయం బయటపడింది. అయనా సరే అధినాయకుడిని ధిక్కరించలేక వారంతా సైలెంట్ గా ఉన్నారు. ఇటీవల పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుల నియామకం విషయంలో ఈ వ్యవహారం మరింత రచ్చకెక్కింది. అయితే సజ్జల ఎపిసోడ్ కాకుండా, మరిన్ని అంతర్గత కుమ్ములాటలు వైసీపీలో జరుగుతున్నాయనే విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. మాజీ మంత్రి పేర్ని నాని చేసిన తాజా వ్యాఖ్యలు వైసీపీలో దుమారం రేపాయి.


పేర్ని ఏమన్నారు..?
సీఎం చంద్రబాబు ఇటీవల తన పర్యటనల్లో కొంతమంది సామాన్యుల వద్దకు వెళ్తున్నారు. సడన్ గా కాన్వాయ్ ఆపి, ప్రజల ఇళ్లలోకి వెళ్లి, వారిని పలకరించి వస్తున్నారు. కొన్ని చోట్ల సామాన్యుల షాపులు వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారం మాజీమంత్రి పేర్ని నానికి నచ్చలేదు. సీఎం చంద్రబాబు సడన్ గా కాన్వాయ్ ఆపితే వెనకొచ్చే కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొనాలి కదా అని ఆయన లాజిక్ తీశారు. అంటే చంద్రబాబు ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నారని, ముందుగా ఒక ఊరిని, ఒక కుటుంబాన్ని ఎంపిక చేసుకుని ఆయన అక్కడికి వెళ్తున్నారని, అదంతా డ్రామా అని, స్క్రిప్ట్ అని రకరకాలుగా విమర్శించేశారు. ఈ క్రమంలో ఆయన తన సొంత పార్టీ నేతపైనే చెణుకులు విసరడం విశేషం.

గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి..
గతంలో ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్నీ ఈ సందర్భంగా ప్రస్తావించారు మాజీ మంత్రి పేర్ని నాని. తమ పార్టీ నేత కేతిరెడ్డి కూడా ఇలాగే జనంలోకి వెళ్లేవారని, ఆయన వెళ్లినప్పుడు ఆయన కాలర్ కి ఒక మైక్ ఉండేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా చంద్రబాబు ఇలాగే ప్రీ ప్లాన్డ్ గా కాలర్ కి మైక్ పెట్టుకుని జనంలోకి వెళ్తున్నారని అదంతా డ్రామా అన్నారు.


అంటే కేతిరెడ్డి కూడా..?
కేతిరెడ్డి గుడ్ మార్నింగా కార్యక్రమం డ్రామా అంటూ పేర్ని నాని నేరుగా చెప్పలేదు కానీ ఆయన ఉద్దేశం అదేనని అంటున్నారు నెటిజన్లు. కేతిరెడ్డి కాలర్ మైక్ తో జనంలోకి వెళ్లినట్టుగానే చంద్రబాబు కూడా ఇక్కడ వెళ్తున్నారని అన్నారు. అంటే ఒకవేళ చంద్రబాబుది డ్రామా అయితే, అప్పట్లో కేతిరెడ్డి చేసింది కూడా డ్రామానే కదా..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వైసీపీలోనే ఒకరంటే ఒకరికి పొసగదని టీడీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. కనీసం కేతిరెడ్డి మైక్ పెట్టుకుని అయినా జనంలోకి వెళ్లారు, పేర్ని నాని అసలు నియోజకవర్గంలో పర్యటించారా అని అడుగుతున్నారు. పేర్ని పేరుతో ఆయన తనయుడు పేర్ని కిట్టు చేసిన ఓవర్ యాక్షన్ అందరికీ తెలుసని అంటున్నారు.

జగన్ సంగతేంటి..?
సిద్ధం సభలకు జగన్ వెళ్తున్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. జగన్ ని కలిసేందుకు మధ్యలో చాలామంది బస్సుల్ని ఆపేవారు. ఆ సందర్భంలో అక్కడ ఐప్యాక్ డ్రామాలు జరిగేవనేది అప్పట్లో టీడీపీ ఆరోపణ. ఐ ప్యాక్ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే జనం, జగన్ ని కలిసేవారని, అలాంటి వారిని ఐప్యాక్ టీమ్ ముందుగానే సెలక్ట్ చేసేదని, వారినే జగన్ వద్దకు వెళ్లనిచ్చేవారని విమర్శించేవారు. ఇప్పుడు పేర్ని నాని, సీఎం చంద్రబాబుని విమర్శించే క్రమంలో ఇవన్నీ పొలిటికల్ డ్రామాలు అనడం ఆశ్చర్యంగా ఉంది. రాజకీయ నాయకుల పర్యటనల్లో ఎప్పుడూ మీడియా వెంటే ఉంటుంది. నాయకులు వెళ్లిన చోటకు మీడియా వెళ్తుంది, జనంతో వారు మాట్లాడే సందర్భాల్ని కవర్ చేస్తుంది. ఒకవేళ ఇదంతా డ్రామా అనుకుంటే.. ఇలాంటి వైసీపీ ఇలాంటి డ్రామాలకు దూరంగా ఉంటుందా..? అని పేర్ని నానిని నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×