Big Tv Live Originals : వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలను ఇప్పటిదాకా చాలానే చూసి ఉంటారు. కానీ సినిమా కోసమే రియల్ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా? కనీసం చూశారా? వినడానికి ఇది కాస్త కన్ఫ్యూజింగ్ గానే ఉన్నప్పటికీ వాస్తవం. సినిమాలను షూట్ చేయడానికే రియల్ గా కొంతమందిని హింసించడం, కొట్టడం, చంపడం వంటివి జరిగాయి. ఇంతటి దారుణమైన సాహసాన్ని ఏ సినిమా కోసం, ఏ డైరెక్టర్ చేశాడో తెలుసుకోవాలని అనుకుంటున్నారా ? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. నిజంగానే సినిమాల కోసం కొంతమందిని కొట్టి చంపిన వివాదాలు మూటగట్టుకున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి కొంతమంది మేకర్స్ ఆ వివాదాల వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది కూడా. రియల్ క్రైమ్స్ ను క్రియేట్ చేయగా, వాటి ఆధారంగా తెరకెక్కిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.
‘కానిబల్ హోలో కాస్ట్’ (Cannibal Holocaust)
1980 లో వచ్చిన ‘కానిబల్ హోలో కాస్ట్’ వివాదాలతో హోరెత్తింది. ఈ ఇటాలియన్ మూవీలో జంతువులను హింసించే సన్నివేశాలు చాలా క్రూరంగా ఉంటాయి. బతికుండాగానే వాటిని చాలా దారుణంగా చాపుతారు. ఇలాగే మనుషులను కూడా ఇందులో హింసించి చంపారని ఒక పుకారు బయటికి వచ్చింది. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. అలా ఈ వివాదం కోర్టు వరకు వెళ్లి, సినిమాలలో నటించిన వాళ్లని అక్కడ చూపించాల్సి వచ్చింది. ఈ సినిమాను రియలిస్టిక్ మేకింగ్ శైలితో తీస్తున్నామని మేకర్స్ చెప్పడం వల్ల, ఈ వివాదం ప్రేక్షకులను కంగారు పెట్టింది. ఆతరువాత ఇందులో జరిగిన సన్నివేశాలను పరిశోధించిన తరువాత, మనుషులను చంపిన ఆనవాళ్ళు ఇందులో లేవని తేలిపోయింది. ఈ మూవీకి Ruggero Deodato దర్శకత్వం వహించారు. ఆపిల్ టివి (Apple TV), ప్రైమ్ వీడియొ (Prime Video) లలో ఈ మూవీ చాలా దేశాలలో సెన్సార్ నిబంధనలతో స్ట్రీమింగ్ అవుతోంది.
‘స్నఫ్’ (Snuff )
1976 లో వచ్చిన ‘స్నఫ్’ సినిమా కూడా ఒక వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కు Michael Findley దర్శకత్వం వహించారు. ఒక మనిషిని నిజంగానే చంపే సన్నివేశం ఇందులో ఉందని ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. ఆ తర్వాత ఇది ఒక పుకారు మాత్రమే అని తేలిపోయింది. ఇది కేవలం నటన ద్వారా మాత్రమే చిత్రీకరించారని తరువాత అర్థం చేసుకున్నారు. అయితే ఇటువంటి సన్నివేశాలు ఉండే సినిమాలు కూడా ఉన్నాయని తెలిసి, కొందరు ప్రేక్షకులకు ఆసక్తిని ప్రదర్శించారు. ఇటువంటి సినిమాలు తీశారని ఆధారాలతో అయితే ఇప్పటివరకు వెల్లడి కాలేదు. కానీ పుకార్లు మాత్రం దేశాలు దాటి వెళ్లిపోయాయి. ఈ సినిమా మేకర్స్, మార్కెటింగ్ కోసం ఇటువంటి పుకార్లు సృష్టించి ఉండవచ్చు. నిజానికి ఇలా సినిమాలు తీయడం పాపం, చట్ట విరుద్ధం. ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు తీయాలిగాని, ఇటువంటి దారుణమైన పుకార్ల తో సినిమాలు తీసే డైరెక్టర్లు భవిష్యత్తులో రాకూడదని కోరుకుందాం. ప్రైమ్ వీడియొ (Prime Video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
హెచ్చరిక : ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.