BigTV English

1 crore donation: కోటి రూపాయల విరాళం.. దాతలకు టీటీడీ కల్పించే సౌకర్యాలు తెలుసా..?

1 crore donation: కోటి రూపాయల విరాళం.. దాతలకు టీటీడీ కల్పించే సౌకర్యాలు తెలుసా..?

తిరుమల తిరుపతి దేవస్థానానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చే దాతలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. బ్రేక్ దర్శనాలతో పాటు ఇతర ప్రత్యేక దర్శనాలు, ప్రత్యేక ప్రసాదాలు, స్వామివారి వస్త్రాలు, వేద ఆశీర్వచనం, వసతి సదుపాయం కల్పిస్తామని అన్నారు. అంతే కాదు, కోటి రూపాయలు విరాళం ఇచ్చే దాతకు జీవిత కాలంలో ఒకసారి 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్, 50 గ్రాముల సిల్వర్ డాలర్ ను ఇస్తామని చెప్పారాయన.


కోటి విరాళం..
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తుందనే విషయం తెలిసిందే. అయితే కొన్నిసార్లు గరిష్ట స్థాయిలో విరాళాలు ఇచ్చే దాతలకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలను టీటీడీ కల్పిస్తోంది. వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించారు. రూ.10వేలు శ్రీవాణి ట్రస్ట్ కి ఇస్తే స్వామివారి బ్రేక్ దర్శన సౌకర్యం వారికి కల్పించేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శ్రీవాణి ట్రస్ట్ విరాళాలు, దర్శనాలు.. కాస్త నెమ్మదించాయి. కొత్తగా కోటి రూపాయల విరాళం స్కీమ్ ప్రవేశ పెట్టారు.

ప్రతి ఏడాదీ ప్రత్యేక దర్శనాలు..
కోటి రూపాయలు విరాళం ఇచ్చే భక్తులకు ప్రతి ఏడాదీ ప్రత్యేక దర్శనాలు కల్పిస్తామని చెప్పారు టీటీడీ చైర్మన్. వారి జీవితకాలంలో దాతతో పాటు నలుగురికి ప్రతి ఏడాదీ దర్శన ఏర్పాట్లు ఉంటాయి. ఏడాదిలో 3 రోజులు సుప్రభాత సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది. 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజుల పాటు సుపథం నుంచి స్వామివారిని దర్శించుకోవచ్చు. దర్శనాల సమయంలో వీరికి 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, ఒక దుప్పట, ఒక రవికె, 10 మహా ప్రసాదం ప్యాకెట్లు ఇస్తారు. ప్రసాదాలతోపాటు.. వేద పండితుల వేద ఆశీర్వచనం కూడా అందిస్తారు. ఏడాదిలో 3 రోజులపాటు రూ. 3 వేలు విలువ చేసే వసతి గదుల సదుపాయం కల్పిస్తారు.


విరాళాలు ఎలా ఇవ్వాలి..?
– కాటేజ్ డొనేషన్ స్కీం
– ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్
– ఎస్వీ విద్యాదాన ట్రస్ట్
– బర్డ్ ట్ర‌స్టు
– శ్రీవేంకటేశ్వర అన్నదాన ట్రస్ట్శ్రీ
– వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్
– శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయాస్ ట్రస్ట్
– శ్రీవేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్
– శ్రీవాణి ట్రస్ట్
– శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్ట్
– శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదినీ స్కీమ్ (స్విమ్స్)
పైన పేర్కొన్న ట్రస్ట్ లలో దేనికైనా దాతలు తమ విరాళాలు అందించవచ్చు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ http://ttddevasthanams.ap.gov.in లో లాగిన్ అయి ఆన్ లైన్ ద్వారా కూడా విరాళాలు చెల్లించవచ్చు. నేరుగా విరాళాలు ఇవ్వాలనుకునేవారు.. టీటీడీ ఈవో, టీటీడీ పేరిట డీడీ లేదా చెక్ తీసుకుని, తిరుమలలోని దాతల విభాగంలో అందజేయాలి.

మినహాయింపులు..
కోటి రూపాయల విరాళం ఇచ్చిన దాతలు తమకు అనుకూల మైన రోజుల్లో దర్శనాలకు రావొచ్చు. అయితే తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజుల్లో మాత్రం దర్శనాలకు మినహాయింపు ఉంటుంది. ఆ రోజులు మినహా మిగతా రోజుల్లో విరాళం ఇచ్చిన భక్తులు తమకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×