Diabetes: రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్ సమస్య వస్తుంది. కొన్ని సార్లు శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడం లేదా ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా జరగకపోవడం వల్ల డయాబెటిస్ వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. 45 ఏళ్ల పైబడి వయస్సు ఉన్నవారు ఎక్కువగా డయాబెటిస్ కు గురయ్యే అవకాశముంటుంది.
మధుమేహంలో టైప్-1 టైప్-2 అనే రెండు ప్రధాన రకాలు ఉంటాయి. జీన్స్ వల్ల టైప్-1 డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉందట. ఊబకాయం వల్ల వచ్చే కొవ్వు ఇన్సులిన్ పనితీరుపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉందని డాక్టర్లు చబుతున్నారు. అందుకే అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట.
డయాబెటిస్ లక్షణాలు:
డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారిలో దాహ, ఆకలి అధికంగా అనిపించడం, తరచుగా మూత్ర విసర్జన వంటి లక్షణాలు కనిపిస్తాయట. డయాబెటిస్ కారణంగా కళ్లపై చెడు ప్రభావం పడే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు. అందుకే కొందరిలో డయాబెటిస్ వల్ల కంటి చూపు మసకబారిపోతుంది. డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతున్న వారిలో చాలా మంది త్వరగా బరువు తగ్గిపోతారట. షుగర్ ఉన్న వారిలో గాయాలు త్వరగా మానకపోవడం అనేది ఎక్కువగా కనిపించే లక్షణం.
డయాబెటిస్ సైడ్ ఎఫెక్ట్స్:
డయాబెటిస్ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారిలో గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఉందట. అంతేకాకుండా కొన్ని సార్లు గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. డయాబెటిస్ వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందట.
డయాబెటిస్ రావొద్దంటే..
డయాబెటిస్ సమస్య రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంతో పాటు జీవనశైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్లు సూచస్తున్నారు. తక్కువ చక్కెర, అధిక ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలట.
ALSO READ: బ్రెయిన్ ఫాగ్ గురించి తెలుసా..?
వ్యాయామం చేయకపోవడం బరువు పెరగడానికి కూడా బరువు పెరగడానికి కారణం అవుతుంది. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుందట. ఫలితంగా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే బరువు పెరగకుండా ఉండేందుకు తరచుగా వాకింగ్, వ్యాయామం వంటివి చేయాలని సూచిస్తున్నారు.అందుకే రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం, శరీర బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.
శరీరానికి సరిపడా నిద్ర ఉంటే ఒత్తిడిని తగ్గిపోతుందట. ఈ రకంగా శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంటుందట. దీంతో డయాబెటిస్ సహా అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.