BigTV English

Pastor praveen death case: పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ.. అరెస్ట్ లు మొదలు

Pastor praveen death case: పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ.. అరెస్ట్ లు మొదలు

పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే పోలీసులు విడుదల చేసిన సీసీ టీవీ ఫుటేజీలతో దాదాపుగా ఈ మిస్టరీ ఓ కొలిక్కి వచ్చినట్టు స్పష్టమవుతోంది. హత్య అని మొదట్లో కాస్త బలంగా మాట్లాడిన వారంతా ఇప్పుడు ఒక్కొక్కరే సీసీ టీవీ ఫుటేజీ చూసి దాన్ని అనాలసిస్ చేస్తున్నారు. అయితే ప్రవీణ్ మరణానికి కేవలం ప్రమాదమే కారణమా, ఇంకేదైనా కారణం ఉందా అనే విషయంలో చాలామంది సొంత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. ఈ తప్పుడు ప్రచారాలపై పోలీసులు సీరియస్ అయ్యారు. అలాంటి ప్రచారం చేసిన ఓ వ్యక్తిని తాజాగా అరెస్ట్ చేశారు.


నాగమల్లేష్ కి రిమాండ్

రాజమండ్రిలోని లలితా నగర్ ప్రాంతానికి చెందిన దేవబత్తుల నాగమల్లేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. స్థానిక వీఆర్ఓ ఫిర్యాదు మేరకు నాగమల్లేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారనేది ఆయనపై అభియోగం. కోర్టు రిమాండ్ విధించడంతో మల్లేష్ ని రాజమండ్రి జైలుకు తరలించారు.


సీసీ టీవీ ఫుటేజీ విశ్లేషణ

ఈనెల 24న పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి బెజవాడ మీదుగా రాజమండ్రి వెళ్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మొదట్లో అది కేవలం యాక్సిడెంట్ అని అనుకున్నారంతా. అయితే కొందరు అది ప్రమాదం కాదని, ఆయన్ని ఎవరో హత్యచేసి రోడ్డు పక్కన పడేశారంటూ ఆరోపించారు. రాజమండ్రి ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆందోళనకారుల ఆరోపణలతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఎక్కడా తొందరపడలేదు, అది ప్రమాదమా, లేక హత్యా అని నిర్థారించేందుకు వారు టైమ్ తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీలను జల్లెడపట్టారు.

కేసులో పోలీసుల పురోగతి

ఈ క్రమంలో దాదాపు 200 సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు విశ్లేషించారు. మొదట్లో కేవలం టోల్ గేట్ వద్ద బైక్ వీడియో విడుదలైంది. ఆ తర్వాత ఆయన వివిధ చోట్ల ఆగిన వీడియోలు, ఆయన్ను పలువురు పరామర్శించినట్టు కూడా వార్తలొచ్చాయి. ప్రవీణ్ పగడాలను నేరుగా కలసిన వారు కూడా మీడియాతో మాట్లాడారు. దీంతో ఈ కేసులో కొంత క్లారిటీ వచ్చింది. ఈ నెల 24న హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరిన ప్రవీణ్ పగడాల, గుంటుపల్లి నుంచి భవానీపురం మార్గంలో ఒకసారి బైక్ పై నుంచి పడిపోయినట్టు తెలుస్తోంది. అక్కడే ఆయన బుల్లెట్ బైక్ హెడ్ లైట్ పగిలిపోయింది. ఆ తర్వాత అదే బైక్ పై ఆయన ప్రయాణం కొనసాగించారు. పెట్రోల్ బంక్ సీసీ టీవీ ఫుటేీలు, గ్రీనరీ పార్క్ లో ఉన్న ఫొటోలు, టీస్టాల్ వ్యక్తి చెప్పిన మాటలు ఆధారంగా ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దాదాపుగా ఇది యాక్సిడెంట్ మాత్రమే అని నిర్థారణకు వస్తున్నారు.

విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం

ఓవైపు కేసు విచారణ జరుగుతుండగా, మరోవైపు పాస్టర్ ది ఖాయంగా హత్యేనంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఆరోపణలు వేరు, అది హత్యేనంటూ ప్రచారం వేరు. కొంతమంది అది హత్యేనని, సోషల్ మీడియాలో రెండు మతాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. దీంతో పోలీసులు ఇలాంటి పోస్టింగ్ ల పై కూడా దృష్టిపెట్టారు. పాస్టర్ మరణాన్ని అడ్డు పెట్టుకుని, మద విద్వేషాలు రెచ్చగొట్టొద్దని ఇప్పటికే ఓసారి పోలీసులు హెచ్చరించారు. అయినా కూడా అలాంటి పోస్టింగ్ లు పెడుతుండే సరికి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా పాస్టర్ వ్యవహారంలో రాజమండ్రికి చెందిన నాగమల్లేష్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. మరికొందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×