BigTV English

Stock Market: స్టాక్ మార్కెట్లు మటాష్.. లక్షల కోట్లు ఫసక్.. కారణం ఏంటంటే..

Stock Market: స్టాక్ మార్కెట్లు మటాష్.. లక్షల కోట్లు ఫసక్.. కారణం ఏంటంటే..

Stock Market: స్టాక్ మార్కెట్లకు మంగళవారం. సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పతనమయ్యాయి. కొత్త ఫైనాన్సియల్ ఇయర్ ప్రారంభం రోజే.. దేశీయ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 350 పాయింట్ల వరకూ డౌన్ అయి 23,200 మార్కును బ్రేక్ డౌన్ చేసింది. ఇంకా పడుతూనే ఉన్నాయి మార్కెట్లు. ఇండెక్స్‌లతో పాటు ఈక్విటీ షేర్లు సైతం ఢమాల్.


ఆర్థిక మాంద్యం వస్తోందా?

మార్కెట్ ఓపెనింగే నెగటివ్. భారత్‌పై ఏప్రిల్ 2 నుంచి అమెరికా ప్రతీకార టారిఫ్‌లు పెంచబోతుండటమే ఇందుకు కారణం. ట్రంప్ నిర్ణయంతో సూచీలు షేక్ అయ్యాయి. అంతర్జాతీయ సంకేతాలన్నీ ఫుల్ నెగటివ్‌గా ఉన్నాయి. క్రూడాయిల్ ధర పెరిగింది. ట్రంప్ విధించే టారీఫ్‌ల ప్రభావం యూఎస్ ఎకానమీని ఫుల్‌గా డ్యామేజ్ చేస్తుందని.. అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే ఛాన్సెస్ ఉంటుందని ఆ దేశానికే చెందిన గోల్ట్‌మన్ శాక్స్ సంస్థ అంచనా వేసింది. ఇలా ఒకే రోజు అనేక అంతర్జాతీయ ప్రతికూల అంశాలు చుట్టుముట్టడంతో ఆ ప్రభావం భారత మార్కెట్లపై విపరీతంగా పడింది.


బడా కంపెనీల షేర్లు ఢమాల్

ఫారిన్ ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుంటున్నారు. నిఫ్టీ 50, సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లోని బడా కంపెనీల షేర్ల పతనం ప్రారంభమైంది. ఐటీ, బ్యాంకింగ్, ఆటో సెక్టార్ స్టాక్స్‌ను తెగ అమ్మేస్తున్నారు. ఫలితంగా.. ఇన్ఫోసిస్, TCS, HCL, Tech M షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. HDFC, యాక్సిస్, ICICI, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా లాంటి బ్యాంకింగ్ షేర్లు కుప్పకూలాయి. మారుతీ సుజుకీ, బజాజ్ ఆటో, M & M, అపోలో టైర్స్ లాంటి ఆటో స్టాక్స్‌ రెడ్‌లో ఉన్నాయి. అయితే.. ఇంతటి ఫాల్‌లోనూ అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, నెస్లే ఇండియా, జొమాటో లాంటి కొన్ని షేర్లు గ్రీన్‌లో ట్రేడ్ అవుతుండటం ఆసక్తికరం.

Also Read : భారత్‌పై రివేంజ్.. ట్రంప్ సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు. ఏప్రిల్ 2 నుంచి ఇండియాపై ప్రతీకార సుంకాలకు సై అన్నాడు. ఫస్ట్ ఇంపాక్ట్.. మన స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం. అమెరికన్ మార్కెట్లు సైతం కొలాప్స్ అవుతాయి. యూరోప్ మీద కూడా టారీఫ్‌ల బాదుడు ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశారు. సో, యురోపియన్ మార్కెట్లు కూడా ఫాల్ అవుతాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అమెరికాతో సహా ఏ దేశమూ బాగుపడదు. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆగమాగం అవడం ఖాయం. ట్రంప్ దెబ్బ అట్లుంటది మరి.

Related News

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Gold Rate: వామ్మో.. దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. రికార్డ్ బ్రేక్.

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

Big Stories

×