BigTV English

Mayasabha Trailer : వెన్నుపోటు వెనక రాజశేఖర్ రెడ్డి, రాజకీయాల్లో సరికొత్త దృక్కోణం

Mayasabha Trailer : వెన్నుపోటు వెనక రాజశేఖర్ రెడ్డి, రాజకీయాల్లో సరికొత్త దృక్కోణం

Mayasabha Trailer : ఇప్పుడు రాజకీయాలు జుజుబి. కానీ అసలైన పొలిటికల్ వార్ అంటే ఒకప్పుడు జరిగేది. బీభత్సమైన ట్విస్టులు కూడా ఉండేవి, ఎవరు ఊహించని మలుపులు మలుపులు ఉండేవి. ముఖ్యంగా అప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో జరిగిన పరిణామాలు ఎవరు ఊహించలేనివి. వాటి గురించి ఎప్పుడు చర్చించినా కూడా ఏదో ఒక కొత్త కోణం బయటపడి ఉంటుంది.


ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది ఆయనను విజనరీ లీడర్ అంటారు. మరి కొంతమంది వారియర్ అంటారు. ఇలా నచ్చిన ప్రజలు ఆయనను గౌరవిస్తూ మాట్లాడుతారు. కొంతమంది నచ్చని వాళ్లు సొంత మామయ్యకి వెన్నుపోటు పొడిచాడు అంటారు. ఇవి కొత్తగా చెప్పాల్సినవి కాదు ఎప్పటినుంచో ప్రజలు అంటూ వస్తున్న మాటలు.

వెన్నుపోటు వెనక రాజశేఖర్ రెడ్డి 


తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో ప్రత్యేకమైన దర్శకుడు దేవకట్ట. ప్రస్థానం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే విలేజ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో అని చూపించాడు. అలానే ఒక పదవి కోసం ఎంతకు తెగిస్తారో కూడా ఆ సినిమాలో చూపించాడు. ఆ తర్వాత ఆయన చేసిన రిపబ్లిక్ సినిమా కూడా రాజకీయాలకు ముడిపడి ఉంటుంది. ఇక ప్రస్తుతం మయసభ అని సోనీ లైవ్ లో ఒక ఒరిజినల్ ఫిలిం చేశారు. ఇది వైయస్ రాజశేఖర్ రెడ్డి మరియు చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న స్నేహాన్ని ప్రతిబింబించేలా అనిపిస్తుంది.

 

అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది ఈ ట్రైలర్ లో ఒక ఆసక్తికరమైన అంశానికి తెర తీశాడు దేవకట్ట. ఈ ట్రైలర్ లో మార్పులు చేర్పులు జరిగిన కూడా. వైస్రాయ్ హోటల్ లో కొంతమంది ఎమ్మెల్యేలను కూడబెట్టి చంద్రబాబునాయుడు మీటింగ్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ మీటింగ్ పెట్టిన తరుణంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఫోన్ చేసినట్లు ఈ ట్రైలర్ లో చూపించాడు దేవకట్ట. ఇప్పటివరకు ఎవరు కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ మాట్లాడలేదు.

ఈ ప్రస్తావని ఎప్పుడు వచ్చినా దివంగత నటుడు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు అవమానం జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. కానీ వెనుక ఏం జరిగిందనేది ఎవరు ఊహించలేదు. అయితే యుద్ధం చేయడం నీ ధర్మం అని దీనిలో రెడ్డి అనే ఒక క్యారెక్టర్ నాయుడుకి చెబుతుంది. దీనిని బట్టి చాలామందికి ఆ హోటల్ లో జరిగిన మీటింగ్ కి రాజశేఖర్ రెడ్డి కి ఏమైనా సంబంధం ఉందా అని కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

నాయుడు, రెడ్డి బాండింగ్ 

మామూలుగా పొలిటికల్ సినిమా అంటేనే రెండు పార్టీల మధ్య గొడవలను చూపిస్తూ ఉంటారు. కానీ ఈ మయసభలో మాత్రం రెండు వేరువేరు పార్టీల్లో ఉన్న ఇద్దరు నాయకుల మధ్య స్నేహాన్ని చూపించే ప్రయత్నం చేశాడు దేవకట్ట. దానితోపాటు కొన్ని సామాజిక అంశాలను కూడా లేవనెత్తుతున్నాడు అని అనిపిస్తుంది. ఇద్దరూ వేర్వేరు పార్టీలో ఉన్న నాయకులు కూడా సామాన్య ప్రజల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి, ఇద్దరూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్నట్లు కూడా దీనిలో చూపించాడు. ఆగస్టు 7న ఇది స్ట్రీమింగ్ కి రానుంది.

Also Read: చంద్రబాబు గా ఆది, Ysr గా చైతు, భారీ వెబ్ సిరీస్ కమింగ్

సంచలనాలకు దారితీస్తుంది 

ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి పెద్దగా ఎవరు చూసి ఉండరు. కానీ ఇది చూసిన తర్వాత దీని గురించి చాలామంది మళ్ళీ డిబేట్ పెట్టడం ఖాయమని అనిపిస్తుంది. ముఖ్యంగా దీని గురించి విపరీతంగా చర్చలు వినిపిస్తాయి. దీనిని తొలగించే ప్రయత్నం కూడా చేసిన ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ఎందుకంటే రీసెంట్ లో చాలా ఈజీగా చాలా మందికి మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈ ట్రైలర్ వలన మనోభావాలు దెబ్బతిన్నట్లు ఎవరైనా ముందుకు వస్తారేమో అని కూడా సందేహం వ్యక్తం అవుతుంది.

Related News

Lokesh Kanagaraju : లోకేష్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… కూలీనే కూనీ చూసింది ?

Little hearts: రిలీజ్ అయిన ఒక్క రోజులోనే… రికార్డు క్రియేట్ చేసిన లిటిల్ హార్ట్స్!

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Kishkindhapuri: ఆ టార్చర్ నుండి బయటపడేసిన కౌశిక్.. నో ముఖేష్ నో స్మోకింగ్..!

Madharaasi Collections : తెలుగు రాష్ట్రాల్లో షాకిచ్చిన ‘మదరాసి’.. ఇలా అయితే కష్టమే..!

Sukumar: పుష్ప 3 ర్యాంపేజ్.. సైమా అవార్డ్స్ స్టేజ్‌పై ఊహించని అప్డేట్ ఇచ్చిన సుక్కు

Big Stories

×