BigTV English

PawanKalyan’s son: పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలి, లోకేష్ ట్వీట్

PawanKalyan’s son: పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలి, లోకేష్ ట్వీట్

PawanKalyan’s son: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చిన్న కొడుకు మార్క్‌ శంకర్‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో శంకర్ చేతులు,కాళ్లకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో శంకర్‌తోపాటు పలువురు చిన్నారులు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.


ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ సింగపూర్‌కు బయలుదేశారు. ఈ ఘటనపై రాజకీయ ప్రముఖులు ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. తొలుత మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి విని షాక్ అయ్యానని, ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. బాబు వేగంగా కోలుకోవాలని కోరుకుంటారని రాసుకున్నారు.

ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి ప్రార్థనలు మరింత బలాన్ని ఇస్తాయని తెలిపారు. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు రాసుకొచ్చారు.  మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రమాదంలో పవన్ కొడుకు గాయపడ్డాడని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని రాసుకొచ్చారు జగన్. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు రాసుకొచ్చారు.


సింగపూర్‌లో రివర్‌ వ్యాలీ ప్రాంతంలో మంగళవారం ఉదయం దాదాపు తొమ్మిదిన్నర గంటలకు ఘటన జరిగింది. అయితే ఈ భవనంలో చిన్నారులకు క్యాంప్‌ నిర్వహిస్తున్నారు. ఏం జరిగిందో తెలీదుగానీ ఒక్కసారిగా రెండు, మూడు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి.

సమాచారం అందుకున్న వెంటనే సింగపూర్‌ ఫైర్ సేఫ్టీ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. భవనం లోపల చిక్కుకున్న వారికి రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 19 మంది గాయపడ్డారు. అందులో 15 మంది వరకు చిన్నారులు ఉన్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

ALSO READ: సింగపూర్‌కు పవన్, చిన్న కొడుక్కి ఏం జరిగింది?

పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్‌నోవా  ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీలో పట్టా పుచ్చుకున్నారు. కొడుకు చదువు కోసం ఆమె అక్కడే ఉంటున్నారు. రివర్ వాలీ టొమాటో కుకింగ్ స్కూల్‌లో చదువుతున్నాడు మార్క్ శంకర్. తల్లి  అన్నా అక్కడ ఉంటూ  కుమారుడ్ని చదివిస్తున్నారు. ఒకటి రెండు సందర్భాల్లో సింగపూర్ వెళ్లారు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్‌నోవా సొంతూరు రష్యా. అక్కడే పుట్టి పెరిగారు.. మోడ‌లింగ్ చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమెకు రష్యా, సింగపూర్ దేశాల్లో ఆస్తులు ఉన్నాయి. ఈ క్రమంలో బాబును అక్కడ చదివిస్తున్నట్లు సమాచారం.

అన్నా లెజ్‌నోవా  మాస్టర్స్ డిగ్రీకి ముందు రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ యూనివర్శిటీ నుంచి ఓరియంటల్ స్టడీస్‌లో డిగ్రీని పూర్తి చేశారు. ఈ స్టడీస్ అసలు ఉద్దేశం ఆసియా దేశాల గురించి చదవటం. ఆసియాలో చరిత్ర, భాషలు, జీవన విధానం గురించి పరిశోధనలు చేశారు కూడా. థాయిలాండ్ చరిత్ర గురించి ఆమె స్టడీ చేసినట్టు తెలుస్తోంది.

 

 

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×