Pawan Kalyan’s Son :ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్ లో చదువుతున్నాడు. అక్కడ జరిగిన అగ్నిప్రమాదం వల్ల గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన సింగపూర్ బయలుదేరనున్నారు . ఈ సంఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఇప్పుడు అవి వివరాలు చూద్దాం..
మెగాస్టార్ స్పందన ..
పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని, వ్యాలీ షాప్ హౌస్ లో ని స్కూల్ లో చదువుతున్నాడు. ప్రమాదం మంగళవారం ఉదయం జరిగినట్టు సమాచారం. భవనంలో రెండు, మూడు అంతస్తులలో ప్రమాదం జరిగినట్లు, మంటలు చెలరేగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే సింగపూర్ అగ్నిమాపాక సిబ్బంది, సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవనం లోపల ఉన్న పిల్లలను రక్షించారు. ఈ ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు అయ్యాయి. ఊపిరితిత్తులలో పొగ వెళ్లడంతో, ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. పొగ పోవడం వల్ల శంకర్ ను హాస్పటల్ కి తరలించారు. ఇప్పుడు శంకర్ బాగానే ఉన్నాడు అని చిరంజీవి తెలిపారు. ఎవరు ఆందోళన చెందవద్దు అని శంకర్ ఆరోగ్యం బాగానే ఉందని చిరంజీవి తెలిపారు. ఈవిషయం తెలిసినప్పటినుండి అసలు పవన్ చిన్న కొడుకు అక్కడ ఎందుకు ఉంటున్నాడు అనే ప్రశ్న అందరిలో వస్తుంది. దానికి కారణం ఇప్పుడు చూద్దాం ..
సింగపూర్ లో అందుకే ఉంటున్నారా ..
పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజ్ నెవ సింగపూర్ లోనే ఉంటున్నారు. ఆమె సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఆమె చదువు కోసమే అక్కడ ఉంటున్నట్లు తెలుస్తోంది. అందుకే అన్నా లెజ్ నేవ కుమారుడు, మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి అక్కడ ఉంటున్నట్లు సమాచారం . ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉప ముఖ్యమంత్రి గా పవన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇక్కడే వున్నారు. ఆయన తో పెద్ద కుమారుడు అకిరా వుంటున్నట్టు సమాచారం .అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లి వస్తుంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ,అడవి తల్లి కార్యక్రమము లో భాగం గా గిరిజనుల ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఇక్కడ పర్యటన సగం లో, ముగించటం ఇష్టం లేక అక్కడ పని ముగించు కొని శంకర్ ను చూడటానికి వెళ్లనున్నారు. ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత పవన్ సింగపూర్ వెళ్ళనున్నారు.