E-Paper
Advertisement

ఎమిరేట్స్ విమానంలో ఏం జరిగింది? ఎమర్జెన్సీ ప్రకటన, ఫ్రాంక్‌ఫర్డ్‌కు మళ్లింపు

ఎమిరేట్స్ విమానంలో ఏం జరిగింది? ఎమర్జెన్సీ ప్రకటన, ఫ్రాంక్‌ఫర్డ్‌కు మళ్లింపు
Advertisement

Frankfurt: దుబాయ్ నుండి లండన్‌లోని హీత్రూకు వెళ్తున్న ఎమిరేట్స్ విమానం గాలిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వెంటనే ఆ విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు. అత్యవసర పరిస్థితికి సంకేతమైన 7700 కోడ్‌ను ఫ్లైట్ EK31 చూపిస్తూ ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో దిగింది. అసలు ఏం జరిగింది?

ఎమిరేట్స్ విమానంలో ఏం జరిగింది?

ఫ్లై దుబాయి విమానం ఘటన తర్వాత విమానాల్లో ఎమర్జెన్సీ ప్రకటన వస్తున్నాయి. తాజాగా దుబాయ్ నుండి లండన్ హీత్రోకు ప్రయాణిస్తున్న ఎమిరేట్స్ A380 విమానం గాలిలో ఉండగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అత్యవసర పరిస్థితికి సంకేతమైన 7700 కోడ్‌ను ఫ్లైట్ EK31 చూపిస్తూ ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం ల్యాండ్ అయ్యింది. ఈ విమానం గురువారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.25 గంటలకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది.

ఎమర్జెన్సీ ప్రకటన, ఫ్రాంక్‌ఫర్డ్‌కు మళ్లింపు

Advertisement

విమానంలో ఓ ప్రయాణికుడికి వైద్య పరమైన అత్యవసర పరిస్థితి తలెత్తడంతో విమానాన్ని తక్షణమే మళ్లించారు. ఈ సంఘటనను విమానయాన సంస్థ ధృవీకరించింది. ప్రయాణికుడికి వైద్య అత్యవసర పరిస్థితి తలెత్తడంతో ఎమిరేట్స్ విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించినట్లు తెలిపింది. విమాన ప్రయాణ సమయంలో క్యాబిన్ సిబ్బంది సహాయం అందించారని, గమ్య స్థానానికి చేరుకున్న తర్వాత ప్రయాణికుడికి వైద్య సహాయం ఏర్పాటు చేశారని ఓ ప్రకటనలో పేర్కొంది. ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ప్రయాణికుడిని విమానం నుండి దించి, వారికి తదుపరి వైద్య సంరక్షణ అందించారు.

ఎమిరేట్స్ విమానం ఫ్రాంక్‌ఫర్ట్‌లో అక్కడి కాలమానం ప్రకారం.. సాయంత్రం 6 గంటలకు బయలుదేరి లండన్ హీత్రోకు తన ప్రయాణాన్ని కొనసాగింది. ఈ విషయాన్ని సదరు ఎయిర్‌లైన్స్ సంస్థ వెల్లడించింది. ఎమర్జెన్సీ ప్రకటన సమయంలో విమానం యూరోపియన్ గగనతలలంలో 40 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది.

Advertisement

ALSO READ: భూమిపై అత్యంత సుందరమైన జలపాతాలు.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

బుధవారం దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో ఒమన్‌కు చెందిన కో-పైలట్.. భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసిన ఘటన జరిగి ఒక రోజు తర్వాత ఎమిరేట్స్ విమానంలో ఎమర్జెన్సీ ప్రకటన రావడంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. మచ్చర్.. కో-పైలట్‌ను ప్రతిఘటించి, కాక్‌పిట్ తలుపు ఓపెన్ చేశాడు. ప్రయాణికులు లోపలికి దూసుకెళ్లి దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. విధుల్లో లేని ఇద్దరు పైలట్లు విమానాన్ని సౌదీ అరేబియాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో మచ్చర్ ప్రస్తుతం దుబాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 

Related News

భూమిపై అత్యంత సుందరమైన జలపాతాలు.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

అనకొండ vs కొండ చిలువ.. పాముల్లో నిజమైన కింగ్ ఏది? దేని దమ్ము ఎంత?

ఇదేందయ్యా ఇది.. కుక్కలు, పిల్లులకు ప్రత్యేక ఆలయాలు.. తరలివెళ్తున్న పెంపుడు జంతువులు!

200 ఏళ్ల నాటి మిస్టరీ.. ఒక్క రాత్రిలో ఖాళీ అయిన ‘దెయ్యాల గ్రామం’.. కుల్ధారా వెనుక రహస్యాలేంటి?

విమానాన్ని హైజాక్ చేయలేదట.. పైలెట్ల లొల్లి వల్లే దారి తప్పిందట.. ఎంత టెన్షన్ పెట్టారో!

దేశంలోనే పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఇదే.. చిన్నది ఎక్కడుందో తెలుసా?

రైళ్లు కావు.. కదిలే రాజభవనాలు.. భారత్‌ లోని ఈ ట్రైన్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

Big Stories

Advertisement
×