Hyderabad: తెలంగాణలో శుక్రవారం నుంచి క్యూర్ చట్టం అమల్లోకి వచ్చింది. నగరంలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-GHMC, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్- CMC, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్-MMCలకు ఒకే సమగ్ర పాలనా విధానం అమల్లోకి వచ్చింది. వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లలో ఉండే సందిగ్ధతలను తొలగించి, పరిపాలనలో ఏకరూపతను తీసుకురావడమే ఈ చట్టం ఉద్దేశం.
ఏడు దశాబ్దాల కిందటి జీహెచ్‌ఎంసీ చట్టంలోకి కొత్త క్యూర్ చట్టం అమల్లోకి వచ్చింది. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ-CURE పరిధిలోకి వచ్చే జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఆస్తి పన్ను గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల పౌర సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చాయి. మూడు కార్పొరేషన్లలో భవన నిర్మాణ అనుమతుల నిబంధనలు ఒకేలా ఉండనున్నాయి.
క్యూర్ యాక్ట్ ద్వారా సిటీలో ప్రాపర్టీ ట్యాక్స్ పెరుగుతుంది. పెరగనున్న ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రాబోతోంది. భవన నిర్మాణ అనుమతి, నివాస ధృవీకరణ పత్ర నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయడానికి క్యూర్ చట్టం వీలు కల్పిస్తుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్-OC నిబంధనలను కఠినతరం చేశారు. OC లేకుండా ఒక భవనానికి విద్యుత్, నీరు లేదా ఇతర సేవలను అందిస్తున్నట్లు తేలిన అధికారిని ఉద్యోగం నుండి తొలగించడం లేకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెంటల్ వాల్యూ ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్ ఇప్పటివరకు వసూలు చేశారు. కొత్తగా శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన క్యూర్ యాక్ట్‌తో క్యాపిటల్ వాల్యూ ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్ విధించనున్నారు అధికారులు. ప్రతీ ప్రాపర్టీకి ఇంటిగ్రేటెడ్ ఐడెంటిటీ కోడ్, ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ బిల్, సీవరేజ్ బిల్, శానిటేషన్‌కు ఒకే ఒక సింగిల్ బిల్లింగ్ విధానం అమల్లోకి వచ్చేసింది. ఆస్తి పన్ను వసూలు విధానంలో ఈ మార్పులు తీసుకొచ్చింది ప్రభుత్వం. మూడు కార్పొరేషన్లకు ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్‌లకు ఒకే విధానం అందుబాటులో ఉంటుంది.
ALSO READ: సిటీ మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కామన్ పాస్‌లు ప్రారంభం?
విలీన ప్రాంతాల పన్నులు, పాలనలో వేర్వేరు విధానాలకు కొత్త చట్టంతో తెర పడనుంది. సింగిల్ పోర్టర్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి వచ్చాయి. నగరంలో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు కొత్త చట్టం ద్వారా హైడ్రాకు చట్టపరమైన అధికారాలు లభించనున్నాయి. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణతో పాటు అక్రమ నిర్మాణాలను తొలగించడానికి ఎంతో దోహదపడతాయి. క్యూర్ కొత్త చట్టం అక్టోబర్ 2 నుంచి అమల్లోకి వస్తున్నప్పటికీ పన్ను విధానాలకు సంబంధించిన మార్పులు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల వల్ల నగరపాలక సంస్థల ఆదాయం పెరగడం, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు లభిస్తాయన్నది ప్రభుత్వం ఆలోచన.