BigTV English

OTT Movie : ఈ బుడ్డదానికి బాయ్ ఫ్రెండ్ కావాలట… ఇది పిల్లకాదు పిడుగు… కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్

OTT Movie : ఈ బుడ్డదానికి బాయ్ ఫ్రెండ్ కావాలట… ఇది పిల్లకాదు పిడుగు… కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్

OTT Movie : చిన్న పిల్లలు తల్లిదండ్రులను చూసే అన్ని విషయాలను నేర్చుకుంటారు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తే అదే చేస్తూ అనుకరిస్తారు కూడా. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమాలో మాత్రం ఓ క్యూట్ పాప తనకు బాయ్ ఫ్రెండ్ కావాలని తల్లినే అడుగుతుంది. అంతేకాదు మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు తెచ్చినట్టు, బాయ్ ఫ్రెండ్ ను సాయంత్రానికల్లా తెచ్చుకుంటుంది. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళ్తే…
కథ జెన్నింగ్స్-జేమ్స్ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక కొత్తగా ఏర్పడిన బ్లెండెడ్ ఫ్యామిలీ. ఏవరీ జెన్నింగ్స్ అనే పాప తల్లి ఎల్లెన్. బెన్నెట్ ను వివాహం చేసుకుంది. అతను చైల్డ్ సైకాలజిస్ట్, టైలర్ క్లోయి జేమ్స్ కు తండ్రి. ఈ కొత్త కుటుంబంలో స్టెప్-సిబ్లింగ్స్ అయిన ఏవరీ, టైలర్, క్లోయి ఒకరితో ఒకరు సర్దుబాటు చేసుకోవడానికి కష్టపడతారు. ఏవరీ తెలివైన, ఆర్గనైజ్డ్ మిడిల్ స్కూలర్. మరోవైపు టైలర్ కూల్, రిలాక్స్డ్ టీనేజర్… క్లోయి చిన్నగా, చలాకీగా ఉంటుంది.

కుటుంబ సభ్యులను దగ్గర చేయడానికి బెన్నెట్ ఒక షెల్టర్ నుండి స్టాన్ అనే కుక్కను దత్తత తీసుకుంటాడు. అయితే స్టాన్ సాధారణ కుక్క కాదు… అదొక మాట్లాడే డాగ్. ఈ రహస్యం మొదట్లోనే ఏవరీ, టైలర్, క్లోయికి తెలుస్తుంది. కానీ వాళ్ళు దీనిని తమ తల్లిదండ్రులకు తెలియకుండా సీక్రెట్ గా ఉంచాలని అనుకుంటారు. ఎందుకంటే స్టాన్‌ గురించి ప్రపంచానికి తెలిస్తే, ప్రయోగాల కోసం తీసుకెళ్లవచ్చని భయపడతారు.


స్టాన్‌కు ఒక సీక్రెట్ బ్లాగ్ ఉంటుంది. అందులో అతను జెన్నింగ్స్-జేమ్స్ కుటుంబంలో జరిగే సంఘటనలను కామెడిగా రాస్తాడు. అతని లక్ష్యం ఇతర మాట్లాడే జంతువులను కనుగొనడం. కానీ అతని బ్లాగ్ కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో, వారిని దగ్గర చేయడంలో సహాయపడుతుంది. ఇక ఆ కుక్క ఆ కుటుంబానికి సలహాలు ఇస్తూ, సమస్యలను పరిష్కరిసస్తుంది. కానీ ఆ తరువాత ఆ కుక్క గత యజమానులు దాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. మరి చివరికి ఆ ఫ్యామిలీ, స్టెప్-సిబ్లింగ్స్ ఒక్కటయ్యారా లేదా? కుక్కకు చివరికి ఏం జరిగింది? అనే అంశాలను మేకర్స్ ఈ సిరీస్ లో ఫన్నీ గా చూపించారు. ఈ సిరీస్ మొత్తం కామెడీ, లైట్-హార్టెడ్ డ్రామాతో నిండి ఉంటుంది. పిల్లలతో కలిసి హ్యాపీగా ఈ సిరీస్ ను ఆస్వాదించవచ్చు.

ఏ ఓటీటీలో ఉందంటే?
ఈ సిరీస్ పేరు “Dog with a Blog”. 2012 నుండి 2015 వరకు డిస్నీ ఛానల్‌లో ప్రసారమైన అమెరికన్ కామెడీ టెలివిజన్ సిరీస్ ఇది. ఈ సిరీస్‌ను మైఖేల్ బి. కప్లాన్, ఫిలిప్ స్టార్క్ సృష్టించారు. ఇందులో జి. హన్నేలియస్, బ్లేక్ మైఖేల్, ఫ్రాన్సెస్కా కపాల్డి, రీగన్ బర్న్స్, బెత్ లిటిల్‌ఫోర్డ్ నటించారు. స్టీఫెన్ ఫుల్ కుక్కకు వాయిస్ ఇచ్చాడు. ఈ సిరీస్ 2012 అక్టోబర్ 12 నుండి 2015 సెప్టెంబర్ 25 వరకు డిస్నీ ఛానల్‌లో మూడు సీజన్‌లు (70 ఎపిసోడ్‌లు) ప్రసారమైంది. ఇప్పుడు మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో (amazon prime video) అందుబాటులో ఉంది.

 

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×