BigTV English

Checking Vizag MP Satyanarayana House: విశాఖ ఎంపీ ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్‌‌ ఐదు గంటల పాటు సోదాలు.. ఏం దొరికాయి..?

Checking Vizag MP Satyanarayana House: విశాఖ ఎంపీ ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్‌‌ ఐదు గంటల పాటు సోదాలు.. ఏం దొరికాయి..?

Flying Squad Search in Visakha MP MVV Satyanarayana House: ఎన్నికల వేళ విశాఖలో రాజకీయాలు అమాంతంగా వేడెక్కాయి. నేతల విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఇదిలావుండగా విశాఖపట్నం వైసీపీ ఎంపీ, తూర్పు నియోజకవర్గం అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో సోదాలు కలకలం రేపుతోంది. ఎలాంటి సమాచారం లేకుండా శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి మిడ్ నైట్ వరకు సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది?


విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గురించి తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలుసు. ఈసారి ఆయన ఎంపీ కాకుండా విశాఖలోని తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రచారంలో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇదిలావుండగా శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయం లో ఎన్నికల ఫ్లయింగ్ స్వ్కాడ్ ఆయన ఇళ్లు, కార్యాలయంలో సోదాలు చేపట్టింది. రాత్రి 8 గంటలకు మొదలైన ఈ సోదాలు, అర్థరాత్రి వరకు జరిగాయి. సోదాల సమయంలో పోలీసులు పార్టీ కార్యకర్తలను, మీడియాను లోపలకు అనుమతించలేదు. అయితే ఎందుకు సోదాలు చేశారన్నది తెలియరాలేదు.

Also Read: జగన్ ఇంటికి వాస్తు దోషం? ఐదేళ్లలో కనిపించలేదా?


ఐదుగంటలపాటు ఫ్లయింగ్ స్వ్కాడ్ సోదాలు జరిపిందంటే మామూలు విషయం కాదన్నది వైసీపీ నేతల మాట. ఈ లెక్కన భారీగా ఏమైనా పట్టుబడే ఉంటాయన్నవార్త విశాఖ అంతటా చక్కర్లు కొడుతోంది. సోదాల వ్యవహారం తాడేపల్లి ప్యాలెస్‌కు సమాచారం వెళ్లినట్టు పార్టీల వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ఎన్నికల కోడ్ వచ్చిన నుంచి ఇప్పటి వరకు వైసీపీ నేతల ఇళ్లలో అధికారులు సోదాలు చేసిన సందర్భం లేదు. మరి ఎంపీ విషయంలో ఎందుకిలా జరిగిందనే దానిపై నేతలు చర్చించుకోవడం మొదలైంది. ఈ సోదాల వెనుక సొంత పార్టీ నేతలే కారణమా? అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది.

కొద్దిరోజులు కిందట ఎంపీ సత్యనారాయణ వైఖరిపై పార్టీలోని నేతలు ఓపెన్‌గా విమర్శలు చేశారు. ఆయన భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. నేరుగా తాడేపల్లి నుంచి ఆదేశాలు రావడంతో ఈ వ్యవహారం కాస్త మరుగునపడింది. కానీ, అంతర్గతంగా మాత్రం ఎంపీతో ఆయా నేతలకు విభేదాలు తారాస్థాయికి చేరాయని నేతలు ఓపెన్‌గా చెప్పుకుంటున్నారు. సరిగ్గా ఏడాది కిందట అంటే జూన్ నెల 2023లో విశాఖలో ఎంపీ సత్యనారాయణ ఫ్యామిలీ సభ్యుల కిడ్నాప్ వ్యవహారం అప్పట్లో సంచలనం రేపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల కారణంగానే కిడ్నాప్ జరిగినట్టు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.

Also Read: Ambati Son in Law Video : అంబటి రాంబాబుకి ఇంటిసెగ.. అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు ఉండడన్న అల్లుడు

మొత్తానికి ఎంవీవీ సత్యనారాయణ మాత్రం ఎవరికో టార్గెట్ అయ్యారనేది నేతలు బలంగా చెప్పుకుంటు న్నారు. మరి ఫ్లయింగ్ స్వ్కాడ్ సోదాల వెనుక ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×