BigTV English

CM Jagan Tadepalli House Vastu: జగన్ ఇంటికి వాస్తు దోషం..? ఐదేళ్లలో కనిపించలేదా.. లేక ఎన్నికల సమయంలో..?

CM Jagan Tadepalli House Vastu: జగన్ ఇంటికి వాస్తు దోషం..? ఐదేళ్లలో కనిపించలేదా.. లేక ఎన్నికల సమయంలో..?

Vastu Changed to CM Jagan Tadepalli House: ఎన్నికల ముందు, తర్వాత నేతలు తమ ఇళ్లకు వాస్తు దోషాలను సరి చేసుకుంటారు. ఇప్పుడు అదే పనిలోపడ్డారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు ఓటమి భయం పట్టుకుందా? ఎక్కడ చూసినా నెగిటివ్ సంకేతాలు ఆయనను వెంటాడుతున్నాయా? ఇటు ఫ్యామిలీ, అటు పార్టీ పరంగా నెగిటివ్ సంకేతాలు వస్తున్నాయా? అందుకే వాస్తు నిఫుణులను తాడేపల్లికి రప్పించారా? ఇలా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి. అసలేం జరిగింది.


అసలే ఎన్నికల వాతావరణం.. ముఖ్యనేతలు క్షణం తీరిక లేకుండా గడుపుతారు. అలాంటిది గురువారం రోజంతా సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లోనే ఉండిపోయారు. ఎందుకన్నది నేతలకు అర్థంకాలేదు. కాకపోతే రెండుమూడు కార్లలో వాస్తు నిఫుణులు వచ్చారు. ఇళ్లంతా తిరిగి ఈశాన్యంగా బరువు పెరిగిందని, దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పారట. అందుకు కొన్ని సూచనలు చేయడంతో వెంట వెంటనే పని మొదలుపెట్టారు. ఆ రోజంతా ఇంటి దగ్గర ఉండి పనులు చూసుకున్నారట సీఎం జగన్.

Also Read: Ambati Son in Law Video : అంబటి రాంబాబుకి ఇంటిసెగ.. అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు ఉండడన్న అల్లుడు


సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్‌ను దగ్గర నుంచి ఎవ్వరూ చూడలేదు. ఎత్తైన గోడలు కనిపిస్తాయి. లాంగ్ వ్యూలో మాత్రమే చూడగలం. ఇంటికి చుట్టూ ఐరన్‌తో కలిసి గోడ నిర్మించడంతో ఒక్కసారి ప్యాలెస్‌లో బరువు పెరిగింది. అమాంతం ఒడిదుడుకులు మొదలయ్యాయి. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కట్టిన ఇనుప కంచెను ఈశాన్యంలో కొంతభాగం తొలగించాలని వాస్తు నిపుణులు చెప్పడంతో వెంటనే దాన్ని తొలగించడం చకచకా జరిగిపోయిందని క్యాంపు కార్యాలయం వర్గాలు తెలిపాయి. కార్మికులు ఇంటికి వచ్చి పనులు చేయడం, వాటిని దగ్గరుండి సీఎం జగన్ పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. ఇకపై అంతా బాగానే ఉంటుందని వైసీపీ అధినేత జగన్ లెక్కలు వేసుకుంటున్నారు.

ఐదేళ్లగా అదే ప్యాలెస్‌లోనే సీఎం జగన్ ఉన్నారని, అప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎలా వచ్చాయని ఆ పార్టీలోని నేతలే మాట్లాడుకుంటున్నారు. వాస్తు సరిచేసినంత మాత్రాన వెంటనే కలిసివస్తుందా అని అంటున్నారు. ఎన్నికల పోలింగ్ కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ఉన్నాయని, ఈ వారంలో ఆయా సమస్యలకు ఫుల్‌స్టాప్ పడుతుందా? అని చర్చించుకోవడం నేతలు వంతైంది.

Also Read: కొడాలి నాని అదే పాట, గెలుపు కోసం కొత్త ఎత్తులు

ఇటీవల‌కాలంలో జగన్ వేసిన ప్లాన్స్ బూమరాంగ్ అవుతున్నాయి. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన నుంచి నెగిటివ్ సంకేతాలు వెంటాడుతున్నాయి. రోడ్ షోలకు పెద్దగా జనం లేకపోవడం, గులకరాయి ఘటన, మరోవైపు చెల్లెళ్లు వ్యక్తిగతంగా విమర్శలు ఎక్కుపెట్టడం, చివరకు సర్వేలో కూడా వ్యతిరేక ఫలితాలు రావడమే దీనికి కారణమని అంటున్నారు. ఐదేళ్లలో లేని సమస్యలు ఇప్పుడెలా వచ్చాయని అంటున్నవాళ్లూ లేకపోలేదు.

Related News

YSR Congress Party: తీవ్ర విషాదం.. వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతి..

Heavy rain: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

Tomato- Onion Prices: భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధర.. రైతులు ఆవేదన..!

Gold Theft: కిలేడీలు.. పట్ట పగలే బంగారం షాపులో చోరీ

Machilipatnam Politics: మచిలీపట్నంలో జనసేన వర్సెస్ వైసీసీ, రంగంలోకి పోలీసులు

Tadipatri Political Tension: తాడిపత్రిలో హై టెన్షన్..పెద్దారెడ్డి ఇల్లు కూల్చివేత ?

AP Women: ఏపీలో మహిళలకు శుభవార్త.. 2 లక్షల వరకు చేయూత, ఇంకెందుకు ఆలస్యం

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసు.. జగన్ ఫ్యామిలీ మెడకు, భారతీ దగ్గర బంధువు సునీల్‌రెడ్డి?

Big Stories

×