Corbin Bosch: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Mumbai Indians vs Gujarat Titans ) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు పైన గుజరాత్ టైటాన్స్ ఆదిపత్యం చెలాయించింది. అయితే… ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత దారుణంగా విఫలమైంది. ఇద్దరూ ఓపెనర్లు విఫలమైన కూడా… మిడిల్ ఆర్డర్ అలాగే చివర్లో కార్బిన్ బాష్ అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ( Mumbai Indians )ఆటగాడు కార్బిన్ బాష్ ( Corbin Bosch ) ఆడిన ఇన్నింగ్స్ ముంబై పరువు కాపాడింది.
Also Read: Ads In IPL : ఒక్క యాడ్ కు ఇన్ని లక్షలా… ఈ లెక్కలు తెలిస్తే జనాలు పిచ్చోళ్ళు రావడం పక్కా !
ఐపీఎల్ చరిత్రలోనే కొత్త షాట్ ఆడిన కార్బిన్ బాష్
ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేయగా నిర్ణీత 20 ఓవర్లలో… 8 వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది. అయితే చివరలో వచ్చిన కార్బన్ బాష్ దుమ్ము లేపాడు. 22 బంతుల్లో 27 పరుగులు చేసి రఫ్ఫాడించాడు కార్బిన్ బాష్. ఇందులో రెండు సిక్సర్లతో పాటు ఒక బౌండరీ కూడా ఉంది. 122 స్ట్రైక్ రేట్ తో రఫ్ ఆడించాడు. అయితే.. ఈ మ్యాచ్ లో ప్రసిద్ధి కృష్ణ వేసిన ఓ ఓవర్ లో అద్భుతంగా.. సిక్సర్ కొట్టాడు కార్బిన్ బాష్. రివర్స్ స్వీప్ చేసి మరి సరికొత్త స్టైల్ లో సిక్సర్ బాదాడు. కార్బిన్ బాష్ కొట్టిన సిక్సర్ క్రికెట్ చరిత్ర, ఐపీఎల్ టోర్నమెంట్ లోనే ( Indian Premier League Tournament ) సరికొత్తదిగా ఉంది. ఈ షార్ట్ కొట్టగానే క్రికెట్ అభిమానులతో పాటు అక్కడే ఉన్న గుజరాత్ ప్లేయర్లు కూడా షాక్ అయ్యారు. అంతలా డిఫరెంట్ గా షాట్ ఆడాడు. అనంతరం.. దురదృష్టవశాత్తు రషీద్ ఖాన్ చేతిలో రన్ అవుట్ అయ్యాడు. దీంతో కార్బిన్ బాష్ ఇన్నింగ్స్ ముగిసింది.
హార్దిక్ పాండ్యా చెత్త రికార్డు, ఒకే ఓవర్లో 11 బంతులు, 18 పరుగులు
అయితే ఈ మ్యాచ్ లో… 156 పరుగులు చేస్తే గుజరాత్ టైటాన్స్ విజయం సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అత్యంత చెత్త రికార్డు ను నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో 8 ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా… ఏకంగా 18 పరుగులు ఇచ్చాడు. 18 పరుగులు పెద్ద మ్యాటర్ కాదు కానీ ఈ ఓవర్ లో ఆరు బంతులు వేయకుండా ఏకంగా 11 బంతులు వేశాడు హార్దిక్ పాండ్యా ( Hardik Pandya). ఇందులో వైడ్లు , రెండు నో బాల్స్ కూడా ఉన్నాయి. ఈ దెబ్బకు 11 బంతులు వేయాల్సి వచ్చింది. దీంతో హార్దిక్ పాండ్యాను దారుణంగా ఆడుకుంటున్నారు.
Also Read: Uppal Stadium : ఉప్పల్ గ్రౌండ్ కంటే… బోరబండ గల్లీలే బెటర్… గంగలో కలిసిన HCA పరువు!
Corbin Bosch with another important impact at the backend for MI
That 2nd six is incredible 🤩pic.twitter.com/JBpfVeJnV0
— Werner (@Werries_) May 6, 2025