BigTV English

Alla Nani in TDP: విడిపోయిన త్రిమూర్తులు.. సైకిల్ ఎక్కేసిన నాని, మరో ఇద్దరు మాటేంటి?

Alla Nani in TDP: విడిపోయిన త్రిమూర్తులు.. సైకిల్ ఎక్కేసిన నాని, మరో ఇద్దరు మాటేంటి?

Alla Nani in TDP:  ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎవరు.. ఎప్పుడు.. ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొందవి. ముఖ్యంగా వైసీపీ నుంచి వలసలు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చాలామంది నేతలు దూరంగా ఉన్నారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు. అధినేత వ్యవహారశైలి మారకుంటే కష్టమని భావించి వలస పోతున్నారు. త్రిమూర్తుల నానిలో ఒకరు సైకిల్ ఎక్కేశారు. మరో ఇద్దరు మాటేంటి? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


ఎవరా త్రిమూర్తులు?

ఏపీలో అధికారం పోయిన తర్వాత వైసీపీ నేతలు తలో దిక్కు చెదిరిపోతున్నారు. వైసీపీ త్రిమూర్తులుగా చెప్పుకునే వారిలో ముగ్గురు నానీలు ఉండేవారు. ఆళ్లనాని, పేర్ని నాని, కొడాలి నాని. వైసీపీ హయాంలో ముగ్గురు మంత్రులుగా కొనసాగారు. ఆ తర్వాత ఇద్దరు జగన్ కేబినెట్ నుంచి డ్రాపయ్యారు. మొన్నటి ఎన్నికల తర్వాత ఆ ముగ్గురు తలో దిక్కు చెదిరిపోతున్నారు.


ముందుగా బయటకు వచ్చేశారు ఏలూరుకి చెందిన ఆళ్ల నాని. వైసీపీ అధికారం పోయిన మూడునెలలకే ఆయన ఆ పార్టీ రాజీనామా చేశారు మాజీ మంత్రి ఆళ్ల నాని. ఆ తర్వాత ఆయన చూపు టీడీపీపై పడింది. ఆళ్ల నాని రాకను ఆ జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు వ్యతిరేకించారు. ఆయన వస్తే ఊరుకునేది లేదని తెగేసి చెప్పారు.

ఆ జిల్లా పరిణామాలపై ఫోకస్ చేసింది టీడీపీ హైకమాండ్. అక్కడి నుంచి నివేదికలు తెచ్చించుకుని జిల్లా నేతలతో మంతనాలు సాగించింది. చివరకు నేతలంతా కూల్ అయ్యారు. ఈ క్రమంలో గురువారం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సైకిల్ కండువాను మెడలో వేసుకున్నారు ఆళ్ల నాని. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, వెస్ట్ గోదావరి జిల్లాలతో సమావేశం అయ్యారు.

ALSO READ:  వంశీకి వైద్య పరీక్షలు పూర్తి – ఏ క్షణమైనా జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు

పార్టీలో ఎలాంటి విభేదాలు లేకుండా నేతలంతా కలిసి పని చేయాలని సూచన చేశారట ముఖ్యమంత్రి. కార్యకర్తల మధ్య సమస్యలు ఏమాత్రం పెద్దది కాకుండా మీరే పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చినట్టు అంతర్గత సమాచారం. నేతలందరికీ పార్టీ న్యాయం చేస్తుందని చెప్పకనే చెప్పారు.

ఆళ్ల నాని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన పని చేశారు. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన, మారిన రాజకీయాల పరిణామాల నేపథ్యంలో సభ్యత్వానికి, పార్టీకి మూడు నెలల కిందట రాజీనామా చేసిన విషయం తెల్సిందే.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏలూరు నియోజకవర్గంలోని వైసీపీ నేతలంతా విడతల వారీగా టీడీపీలో చేరిపోయారు. జెడ్పీ ఛైర్మన్, ఆమె భర్త, కార్పొరేటర్లు ఇలా అందరూ సైకిల్ ఎక్కేశారు.చివరకు మాజీ మంత్రి ఆళ్ల నాని వంతైంది. ఆయనకు పార్టీలో ఎలాంటి బాధ్యతలు సీఎం చంద్రబాబు అప్పగిస్తారనేది ఆసక్తిగా మారింది.

ఇక వైసీపీ మరో ఇద్దరు నానిలు ఉన్నారు. ఒకరు పేర్ని నాని కాగా, మరొకరు కొడాలి నాని. టీడీపీ వీరిద్దరు బద్ద శత్రవులు. ఒకరు డైరెక్ట్ గా సైకిల్ పార్టీని టార్గెట్ చేస్తే.. మరొకరు ఇండైరెక్ట్ గా చేశారు. రేషన్ బియ్యం వ్యవహారంలో ఒకరు చిక్కుకున్నారు. మరొక నాని రూటు ఎటున్నది ఆసక్తికరంగా మారింది. ఏమో రేపటి రోజున వీరిద్దరు బీజేపీలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×