Upcoming Tollywood Movies: ప్రస్తుతం తెలుగు సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూసే పరిస్థితి వచ్చేసింది. ప్రతీ సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేస్తూ దూసుకుపోతుండడంతో టాలీవుడ్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇక రానున్న రెండేళ్లలో మరెన్నో పాన్ ఇండియా చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా.. అందులో స్టార్ హీరోల సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అరడజను పాన్ ఇండియా సినిమాలు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాయి.
ఎస్ఎస్ఎమ్‌బీ 29
ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్న సినిమా ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’. రాజమౌళి (Rajamouli), మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమవ్వడంతో దీని గురించి మాట్లాడుకుంటున్న ప్రేక్షకుల సంఖ్య ఎక్కువమయ్యింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీకి 2027లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
స్పిరిట్
పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ (Prabhas) నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అయ్యాయి. అలాంటి సమయంలోనే ‘సలార్’తో ఫ్యాన్స్‌ను సంతోషపెట్టాడు ఈ హీరో. అదే జోష్‌లో ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కష్టపడుతున్నారు. ఇంతలోనే సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే మూవీ చేస్తున్నట్టుగా అనౌన్స్‌మెంట్ వచ్చింది. అప్పటినుండి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ ఇది సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందో ఇంకా క్లారిటీ లేదు.
Also Read: ఏంటి.. సంయుక్త మీనన్ కు ఆ పాడు అలవాటు ఉందా..?
ఓజీ
సుజీత్ లాంటి యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ ఈ సినిమా సైన్ చేయగానే పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. దీంతో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన ‘ఓజీ’ (OG) వాయిదాలు పడుతూనే ఉంది. అసలైతే గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ మూవీ విడుదల కావాల్సింది. కానీ ఇంకా అవ్వకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు.
ఎన్‌టీఆర్ – నీల్
‘సలార్’ లాంటి సినిమాతో ప్రభాస్‌కు, తన ఫ్యాన్స్‌కు ఓ రేంజ్‌లో ఊరటనిచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ దర్శకుడి ఎలివేషన్ సీన్స్‌కు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. అలాంటి దర్శకుడు ఎన్‌టీఆర్‌తో సినిమా అనగానే ప్రతీ ఒక్కరిలో ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ప్రస్తుతం ఈ ఇద్దరి చేతిలో ఎలాంటి కమిట్మెంట్స్ లేకపోవడంతో త్వరలోనే దీని షూటింగ్ ప్రారంభం కానుంది.
ఏఏ 22
అల్లు అర్జున్ (Allu Arjun), త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌పై ప్రేక్షకులకు విపరీతమైన నమ్మకం ఉంది. ఇప్పటికే వీరి కాంబోలో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురంలో’ లాంటి సినిమాలు వచ్చాయి. ఈ మూడు చిత్రాలు ఒకదానికి మించి మరొకటి హిట్లు నిలిచాయి. దీంతో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న నాలుగో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరగా ప్రారంభిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు.
Also Read: తమిళంలో జాన్వీ కపూర్ లాంచ్‌కు సర్వం సిద్ధం.. రంగంలోకి కాంట్రవర్షియల్ డైరెక్టర్..
ఆర్సీ 16
‘గేమ్ ఛేంజర్’ సినిమా రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను అనుకున్నంత రేంజ్‌లో తృప్తిపరచలేదు. అందుకే తన తరువాతి సినిమాతో అయినా ఫ్యాన్స్‌ను హ్యాపీ చేయాలని ఫిక్స్ అయ్యాడు రామ్ చరణ్. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టాడు చరణ్. ‘ఆర్సీ 16’ (RC 16) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథతో రాబోతోంది.