BigTV English

Heavy rains: రాష్ట్రంలో కుండపోత వానలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!

Heavy rains: రాష్ట్రంలో కుండపోత వానలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!

Heavy rains: తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణ వణికిపోతుంది. రాష్ట్యవ్యాప్తంగా 560 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా మన్యం జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. రాష్ట్యంలో అత్యధికంగా ములుగు జిల్లా గోవిందరావుపేటలో 22సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఆదిలాబాద్ జిల్లా తాంసిలో 17.3 సెంటీమీటర్లు నమోదయింది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో కేవలం గంటన్నర వ్యవధిలో 12.5 సెంటీమీటర్ల కుండపోత కురిసింది.


మరో మూడు రోజులు భారీ వర్షాలు..
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ఇంకా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఐదు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరో తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దీంతో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయిలో ఈఎన్‌సీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాల్లో చేరిన నీరు
భారీ వర్షాలకు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. కొండవీడు వాగు ఉద్ధృతికి.. తాడికొండ, తుళ్లూరు సహా అమరావతిలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. కూరపాడు నియోజకవర్గంలో చాలా ఇళ్లలోకి వరదనీరు చేరింది. పల్నాడు జిల్లాలో కూరపాడు సత్తెనపల్లి ఏరియాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుంటూరు నగరంలో 3 వంతెనలతో పాటు కంకర కుంట గేటు కింద ఉన్న ప్రాంతమంతా జలమయం అయ్యింది. ఎప్పుడు వర్షం వచ్చినా.. జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. కంకర గుంట గేటు కింద పెద్ద పెద్ద మోటార్లు పెట్టి.. నీటిని తొలగించేందుకు అధికారులు నిత్యం పాట్లు పడుతున్నారు.


వణికిపోతున్న ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు
ఆదిలాబాద్‌ పట్టణంలోని పలు ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని అనార్‌పల్లి వాగు పొంగిపొర్లడంతో.. కరంజీవాడ, అంద్‌గూడ, బోరిలాల్‌గూడ, గోండుగూడ, లక్మాపూర్ గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ములుగు మండలం బుద్దారం రహదారిలోని రాళ్లవాగు ఉప్పొంగి అప్రోచ్ రోడ్డును ముంచెత్తడంతో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపో యాయి. వెంకటాపురం మండలంలోని పలువాగులు ప్రమాదకరంగా ప్రవహించడంతో మూడు గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. జంపన్నవాగు ఉద్ధృతితో రాకపోకలు స్తంభించాయి. బొగత జలపాతానికి వరద ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో పర్యాటకుల సందర్శనను నిషేధించారు.

వర్షాల కారణంగా రైతుల కష్టాలు
వరదల ధాటికి పొలాల్లోకి కూడా పెద్దఎత్తున నీరు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో.. ఇప్పటికీ పొలాల్లో నీరు నిలిచే ఉంది. అయితే.. నాట్లు వేయకపోవడంతో.. పెద్దగా పంట నష్టం జరగలేదని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: రియల్ ఎస్టేట్‌కి బెస్ట్.. సీఎం రేవంత్ రెడ్డి నయా ప్లాన్ ఇదే.!

అధికారయంత్రాగాన్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం
ప్రతి సర్కిల్ స్థాయిలో సూపరింటెండెంట్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఉన్న కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్‌లను సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో అత్యవసర పరిస్థితులు తలెత్తితే స్థానిక అధికారులు వెంటనే స్పందించేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలు కూడా ఎక్కడైనా రహదారులు దెబ్బతిన్నా, కల్వర్టులు కూలినా, గండ్లు పడినా వెంటనే సంబంధిత నెంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Related News

Ramreddy Damodar Reddy: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఇక లేరు

Kavitha: లక్ష మందితో బతుకమ్మ పండుగ చేసి చూపిస్తా.. కవిత కీలక వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వానలు, బయటకు వెళ్తే అంతే సంగతులు..!

Telangana Politics: అనిరుధ్ రెడ్డి vs కేటీఆర్, ప్రతీది రాజకీయమే.. స్వేచ్ఛ మీ దగ్గరెక్కడ?

Telangana politics: మొదలైన స్థానిక ఎన్నికల వేడి.. సీఎం రేవంత్ కీలక భేటీ, ఏడున అభ్యర్థుల ప్రకటన

Minister Uttam: తెలంగాణలో ఈసారి రికార్డ్ స్థాయిలో ధాన్యం ఉత్పత్తి.. దేశంలో మరోసారి అత్యధికంగా..?

Weather News: ఈ జిల్లాల్లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్, ఈ టైంలో బయటకు వెళ్లొద్దు

Free Bus Ticket: డీలక్స్ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వలేదని.. బస్సు కింద పడుకుని మహిళ హల్ చల్

Big Stories

×