Vizianagaram: ఈ మధ్య ఏపీ పదో తరగతిలో మంచి మార్కులతో పాసైనవారికి కొన్ని కొన్ని ఏరియాల్లో శుభవార్త వింటున్నాము. అనంతపురం జిల్లాలో ఐదుగురు బాలికలను విమానం ఎక్కించారు ఓ ఎంఈవీ. తాజాగా విజయనగరం జిల్లాలో జిఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్ డాక్టర్ యడ్ల నీరజారాణి పదో పాసైన విద్యార్థులకు శుభవార్త చెప్పారు. అదృష్టం వరిస్తే.. 25 వేలు మనం సొంతం అవుతుంది. అదెలా అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
పదో తరగతి పాసైన వారికి అదొక శుభవార్త. ఏకంగా రూ. 25 వేలు సొంతం చేసుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా? విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో పదో తరగతి పరీక్షల్లో పాసైన వారికి బంపరాఫర్. పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు మాత్రమే.
రాజాం నియోజకవర్గంలోని జి. సిగడాం, తెర్లాం, పాలకొండ, బూర్జ, మెరక ముడిదాం, బలిజీపేట మండలాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థినులకు మాత్రమే. దయచేసి ఈ విషయం మరిచిపోవద్దు. వారికి మరింత ప్రోత్సాహించేందుకు జిఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ యడ్ల నీరజారాణి ఆధ్వర్యంలో ఓ పరీక్ష నిర్వహిస్తోంది.
ప్రభుత్వ పాఠశాలలో 540 మార్కులకు పైన పొందిన విద్యార్థిణిలకు మాత్రమే. వచ్చేవారం మే 11న ఆదివారం రాజాం డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెస్టు పెడుతున్నట్లు వెల్లడించారు. పరీక్ష నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటించనుంది. అందులో మొదటి మూడు స్థానాల్లో వచ్చినవారికి ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు నిర్వాహకులు. అంతేకాదు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను సన్మానించనున్నారు.
ALSO READ: తిరుమలలో మీకు సాయం కావాలా? వెంటనే వీరిని సంప్రదించండి?
ఆ టెస్టులో ఫస్ట్ వచ్చినవారికి రూ.25000, సెకండ్ వచ్చినవారికి రూ. 15000, థర్డ్ లో నిలిచినవారికి రూ. 10,000 రూపాయలు ఇస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే బాలికలు తప్పనిసరిగా మార్కుల జాబితా, టెన్త్ హాల్ టికెట్ తీసుకుని వెళ్లాలి. లేకుంటే పరీక్షకు ఎట్టి పరిస్థితిల్లో అనుమతించరు.
మే 11న ఉదయం 8 గంటల నుంచి 9:30 నిమిషాలకు పరీక్ష జరుగుతుంది. స్టూడెంట్స్ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. రాజం మండలం డోలపేట ఉన్నత పాఠశాలలో ఈ పరీక్ష జరగనుంది. పరీక్షలో ఏ విభాగంలో ఉంటుందని మీ డౌట్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో ఉండనుంది.
మల్టిపుల్ ఛాయిస్‌లో ఇంగ్లీష్, తెలుగు మీడియం ఓఎంఆర్ పద్ధతిలో ఉంటుంది. మొత్తం 60 మార్కులకు ఈ టెస్టు ఉండనుంది. అందులో మ్యాథ్స్-25, ఫిజిక్స్-10, కెమిస్ట్రీ-10, బయాలజీ-15 మార్కులకు ఉండనుంది. ఈ అవకాశాన్ని పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.