BigTV English

High Tension Tadeparthi: తాడిపత్రిలో కేతిరెడ్డి ఎంట్రీ.. తాడోపేడో తేలాల్సిందే!

High Tension Tadeparthi: తాడిపత్రిలో కేతిరెడ్డి ఎంట్రీ.. తాడోపేడో తేలాల్సిందే!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాడిపత్రి కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందనే చెప్పాలి. రాష్ట్రమంతా రాజకీయం ప్రశాంతంగా ఉంటే ఒక్క తాడిపత్రి లో మాత్రం ఎప్పుడు పొలిటికల్ హీట్ రగులుతూనే ఉంటుంది. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల వైరం ఫ్యాక్షన్ వాతావరణాన్ని తలపిస్తూ ఎప్పుడూ టెన్షన్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. గత 30 ఏళ్లుగా తాడిపత్రిలో జేసీ కుటుంబానిదే ఆధిపత్యం. జెసి కుటుంబంలో పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీలో ఉన్న వారే గెలుస్తూ వచ్చారు.

కానీ 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. కేతిరెడ్డి కుటుంబం నుంచి మొదటిసారి వైసీపీ నుంచి పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక అప్పటినుంచి ఈ ఆధిపత్య పోరు మరింత ఎక్కువయింది. ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో తాడిపత్రి హోరెత్తుతూ వస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి పోలీసుల సహాయంతో జెసిని ఇంటి బయట కూడా రానివ్వకుండా అనేకమార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు.. ఏక్కడ ఏ ధర్నా కార్యక్రమం, ఏ ఆందోళన చేసే ప్రయత్నం చేసినా అడ్డుకున్నారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక అడుగు ముందుకేసి ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయన సోఫాలో కూర్చుని ఆ కుటుంబానికి సవాల్ విసిరారు. ఇక అప్పటి నుంచి వారి మధ్య ఆధిపత్యపోరు మరింత పీక్స్ కు చేరింది.


సీన్ కట్ చేస్తే ఇప్పుడు జేసీ వంతు . 2024 ఎన్నికల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ నుంచి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలవడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డికి చుక్కలు కనపడుతున్నాయట. ఎన్నికల్లో ఓటమి అనంతరం తాడిపత్రి కి దూరమైన పెద్దారెడ్డి ఇంతవరకు ఆయన సొంత ఇంటి మొహమే చూడలేదు. 2024 ఎన్నికల సమయంలో చెలరేగిన హింస వల్ల తాడిపత్రిలోని కీలక నేతలందరినీ పట్టణానికి దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించడంతో పెద్దారెడ్డి తాడిపత్రికి దూరంగా ఉంటూ కాలం గడపాల్సి వచ్చింది. కానీ కోర్టు ఆదేశాలతో ఇటీవల నేతలు ఒక్కొక్కరిగా తాడిపత్రికి చేరుకుంటున్నారు. పెద్దారెడ్డి మాత్రం ఇప్పటివరకు తాడిపత్రిలోని తన సొంత ఇంటి మొహం చూడలేకపోయారు.

Also Read: మోదీ పేరెత్తని వైసీపీ.. జగన్ కి ఎందుకంత భయం..?

మధ్యలో ఒకసారి ఏదో పేపర్స్ కోసమని తాడిపత్రి కి వెళ్లే ప్రయత్నం చేయగా పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగడంతో పోలీసులు అప్పటినుంచి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి ఎంట్రీ లేకుండా చేశారు. ఆ క్రమంలో తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టు నుంచి తాడిపత్రికి వెళ్లేందుకు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. రెండుమూడు రోజుల్లో ఆయన తాడిపత్రిలో ఎంటర్ అవ్వడానికి సన్నాహాలు చేసుకుంటున్నారంట. కానీ పెద్దారెడ్డి రాకను జేసీ ప్రభాకరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానిపై పబ్లిక్ గానే పెద్దారెడ్డిని తాడపత్రిలోకి రానివ్వనని జేసీ స్టేట్మెంట్ ఇవ్వడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఆ క్రమంలో పెద్దారెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న గ్రౌండ్ వద్ద పెద్ద సంఖ్యలో రాళ్ల కుప్పలు దర్శనమివ్వడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు… ఆ రాళ్ల కుప్పలను తొలగించారు. ఇక తాడిపత్రి వెళ్ళే విషయంలో పెద్దారెడ్డి కూడా గట్టిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈసారి ఎలాగైనా తాడిపత్రి పట్టణంలో అడుగు పెట్టాలని నిశ్చయించుకున్నారట. జిల్లా ఎస్పీని కలిసి అందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటు లేరంట. మరోసారి జిల్లా ఎస్పీని కలిసి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలను చూపించి పోలీస్ బందోబస్తుతో వెళ్లాలని అనుకుంటున్నార.. అయితే జేసీ వార్నింగ్ నేపథ్యంలో పోలీసులు కేతిరెడ్డికి పర్మిషన్ ఇస్తారా లేదా అన్నది ఉత్కంఠభరితంగా మారింది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×