BigTV English

Brahmamudi Serial Today October 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కనకంతో రాయబారం చేసిన అపర్ణ, ఇందిరాదేవి – అనామిక సంగతి చూస్తానన్న కావ్య

Brahmamudi Serial Today October 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కనకంతో రాయబారం చేసిన అపర్ణ, ఇందిరాదేవి – అనామిక సంగతి చూస్తానన్న కావ్య

Brahmamudi serial today Episode:  వాటర్‌ కోసం సురేష్‌ బయటకు వెళ్లగానే కావ్య అగ్రిమెంట్‌  పేపరు తీసుకుని బ్యాగులో దాచేస్తుంది కనకం. ఇక అంతా అయిపోయాక అక్కడి నుంచి వెళ్లేముందు అనామిక వస్తుంది. కావ్య అగ్రిమెంట్‌ పేపర్‌ ఇవ్వమని లేకుంటే పోలీసులకు కంప్లైంట్‌ చేస్తానని బెదిరిస్తుంది. దీంతో కనకం అగ్రిమెంట్‌ పేపర్‌ ఇచ్చి వస్తుంటే మర్యాదగా నువ్వే దగ్గరుండి కావ్యను ఆఫీసుకు పంపించు అని చెప్తుంది. అనామిక. దీంతో కోపంగా కనకం పంపిచనని అసలు  నీ కూతురు నీ ఆఫీసుకే రాదని ఏం చేసుకుంటావో చేసుకో అని వార్నింగ్‌ ఇస్తుంది. దీతో అనామిక నా సంగతి నీకు తెలియదు అంటుంది. అవునా నా సంగతి కూడా నీకు తెలియదు నీ మాజీ అత్త ధాన్యలక్ష్మీని రుద్రాణిని అడుగుత చెప్తారు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది కనకం.


ఇంటికి వచ్చిన కనకం ఎవరి కంట్లో పడకుండా ఇట్లోకి మెల్లగా వెళ్తుంది. ఇంతలో కావ్య వచ్చి అమ్మా ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అని అడుగుతుంది. దీంతో కంగారుపడ్డ కనకం తేరుకుని న్యాయాన్ని నిలబెట్టడానికి వెళ్లాను. ధర్మాన్ని గెలిపించడానికి వెళ్లాను. అన్యాయాన్ని ఎదిరించడానికి వెళ్లాను అంటూ భారీ డైలాగులు చెప్తుంది. దీంతో కావ్య కొంపదీసి మా అత్తగారింటికి వెళ్లి మా ఆయనతో గొడవ పడ్డావా? ఏంటి అని అడుగుతుంది.

చీ నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది అంటుంది కనకం. ఏం లేదు న్యాయం, అన్యాయం అంటూ నినాదాలు చేస్తున్నావు కదా? అందుకే డౌట్‌ వచ్చింది అంటుంది కావ్య. దీంతో నేను అక్కడికి వెళ్లలేదు కానీ ఇంకో దగ్గరకు వెళ్లాను నీకోసమే అంటూ భయంగా అనామిక వాళ్ల ఆఫీసుకు వెళ్లాను నీ అగ్రిమెంట్‌ పేపర్స్‌ కొట్టేయడానికి అని కనకం నిజం చెప్తుంది. అక్కడకు తాను ఎలా వెళ్లింది. ఏం జరిగింది అనే విషయం మొత్తం చెప్తుంది. దీంతో కావ్య, కనకాన్ని తిడుతుంది. ఆ విషయం నేనే చూసుకుంటానని చెప్తుంది.


తర్వాత బెడ్‌ రూంలో నిద్రపోతున్న రాజ్‌ దగ్గరకు కావ్య వెళ్తుంది. రాజ్ ను తట్టి నిద్ర లేపుతుంది. నిద్ర లేచిని రాజ్‌ కోపంగా ఏయ్‌ నువ్వా ఏ ముఖం పెట్టుకుని మళ్లీ  వచ్చావు అని అడుగుతాడు. ఆ.. నేనే.. కందిపప్పు ముఖం పెట్టుకుని వచ్చాను అంటుంది కావ్య. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇంతలో రాజ్‌ గట్టిగా అరుస్తూ నిద్ర లేస్తాడు. ఇదంతా కలా అనుకుని బెడ్‌ రూంలో పడుకోకుండా కిందకు హాల్లోకి వచ్చి సోఫాలో పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం హాల్లోకి వచ్చిన ఇందిరాదేవి, అపర్ణ, రాజ్ ను చూసి నవ్వుకుంటారు.

దగ్గరకు వెళ్లి రాజ్ ను నిద్ర లేపిన ఇందిరాదేవి ఇక్కడ పడుకున్నావేంటి అని అడుగుతుంది. రాజ్ ఏదో చెప్తుంటే అంతా నాకు అర్థమైందిలే రాజ్‌ అంటుంది ఇందిరాదేవి. దీంతో ఏం అర్థమైంది నాన్నమ్మా అంటాడు రాజ్‌. ఇన్ని రోజులు కావ్యతో కలిసి పడుకోవడం అలవాటు అయిపోయి ఇప్పుడు తోడు లేక తనే గుర్తుకు వస్తు ఉండటంతో గదిలో ఒంటరిగా ఉండలేక ఇక్కడకు వచ్చి పడుకున్నావు కదా? అంటుంది ఇందిరాదేవి.

హలో నాన్నమ్మ గారు ఆవిడ గారు లేకపోతే నాకు నిద్ర పట్టదా? అయినా మీకేం పని పాట లేదా? దాని పేరు ఇంట్లో ఎత్తొద్దు అంటే మళ్లీ మళ్లీ తీసుకొస్తారు. అంటూ సీరియస్‌ గా రాజ్‌  కోప్పడతాడు. దీంతో  నువ్వు ఎన్ని అబద్దాలు చెప్పినా నీ ముఖంలో కనిపిస్తుందిరా..నీకు అన్ని మీ తాతయ్య పోలికలే అంటుంది ఇందిరాదేవి. మధ్యలో ఆయనేం పాపం చేశారు అని అడుగుతాడు రాజ్‌. ఏ పాపం చేయలేదు. కానీ అచ్చం నీలాగే నేను మొదటి కాన్పుకు పుట్టింటికి వెళ్లినప్పుడు రూంలో నిద్ర రాక కింద ఇలా హల్లో సోఫాలో పడుకునే వారట. అని ఇందిరాదేవి చెప్పగానే రాజ్‌ కోపంగా ఇద్దరిని తిట్టుకుంటూ పైకి వెళ్లిపోతాడు.

రాజ్‌ ను చూస్తే భయమేస్తుందని అపర్ణ చెప్తుంది. వీళ్లిద్దర్ని కలుపుదామని మనం ఎంత ప్రయత్నించినా ఇంకా దూరం అవుతున్నారే తప్పా కలవడం లేదని బాధపడుతుంది. అసలు వీళ్లను కలపే వారే లేరా? అని అనుమాన పడుతుంది అపర్ణ. ఇంతలో సడెన్‌గా అపర్ణ, ఇందిరాదేవి ఒకేసారి కనకం అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అవును కనకమే ఏదైనా చేసి వీళ్లిద్దరిని కలపాలంటే కనకానికి మాత్రమే సాధ్యం అనుకుంటారు. తర్వాత గుడిలో కనకాన్ని కలుస్తారు ఇందిరాదేవి, అపర్ణ. నువ్వే ఎలాగైనా వాళ్లిద్దర్ని కలపాలని చెప్తారు. అయితే నేను చెప్తే వాళ్లు వినే పొజిషన్‌ లో లేరని కలపడం కొంచెం కష్టమే అంటుంది కనకం. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ, నర్మదను అడ్డంగా ఇరికించిన శ్రీవల్లి..పరువు తీసిన భాగ్యం..అమూల్యతో విశ్వం..

Intinti Ramayanam Today Episode: అడ్డంగా దొరికిపోయిన పల్లవి.. షాకిచ్చిన చక్రధర్..పల్లవిని గెంటేస్తారా..?

GudiGantalu Today episode: ప్రభావతి షాకిచ్చిన బాలు.. మీనాతోనే ఆ పని..రోహిణికి కడుపు మంట..

Brahmamudi Serial Today October 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్య కోసం కనకం ఇంటికి వెళ్లిన రాజ్‌

Nindu Noorella Saavasam Serial Today october 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరుకు షాక్‌ ఇచ్చిన మంగళ

Today Movies in TV : శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Gundeninda Gudigantalu Prabhavathi: ‘గుండెనిండా గుడిగంటలు ‘ ప్రభావతి రియల్ లైఫ్.. అస్సలు ఊహించలేదు..

Mogalirekulu Devi : ‘మొగలిరేకులు’ దేవి ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఇదే..?

Big Stories

×