BigTV English

AP Protem Speaker: ఏపీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం..

AP Protem Speaker: ఏపీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం..

Gorantla Butchaiah Chowdary Sworn In as Protem Speaker: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో బుచ్చయ్య చౌదరితో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు.


ఈ కార్యక్రమానికి మంత్రులు నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యప్రసాద్, ఆనం రామనారాయణరెడ్డి పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక శుక్రవారం ప్రొటెం స్పీకర్‌ బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు.

శాసనసభలో సీనియర్ లేదా ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వారిని ప్రొటెం స్పీకర్‌గా అవకాశం కల్పించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటివరకు ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.


Also Read: ఏపీ.. ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం..

శుక్రవారం(జూన్ 21) నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల 46 నిమిషాలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించాక స్పీకర్ ఎన్నిక జరగనుంది.

ముందుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణం చేయనున్నారు. ఈ తరువాత ఇంగ్లీష్ అక్షరాల ప్రాతిపదికన ఎమ్మెల్యేలు వరుసగా ప్రమాణం చేయనున్నారు. ఇక వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ఆ పార్టీ అధినేత వై ఎస్ జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేయనున్నారు.

Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×