Hair Loss Natural Solution| పరుగులు తీసే జీవితంలో పోషాకాహార లోపం, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, పని ఒత్తిడి, కాలుష్యం లాంటి కారణాల వల్ల ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. కొందరికి జుట్టు పలుచబారిపోతే మరి కొందరి త్వరగా రాలిపోతూ ఉంటుంది. దాంతో త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. దీంతో మానసికంగా కూడా కుంగిపోతుంటారు. కొందరైతే డిప్రెషెన్ బారిన పడిన కేసులు కూడా ఉన్నాయి.
అయితే తీవ్రమైన సమస్యలకు కొన్ని కొన్ని సార్లు సులభమైన పరిష్కారాలు ఉన్నట్లు. ఈ సమస్యకు కూడా ఓ సింపుల్ సమాధానం ఉంది. ప్రకృతి పరంగా కొన్ని అద్భుతమైన ఔషధ గుణాలున్న మూడు పదార్థాలు మిశ్రమమే దీనికి పరిష్కారం.
ప్రకృతి వైద్య నిపుణుల ప్రకారం.. ప్రతిరోజు ఉసిరి, కరివేపాకు, అల్లం కలిపిన రసాన్ని తాగితే కేవలం ఒక నెలలోనే నిర్జీవంగా ఉండే కుదుళ్లలో మళ్లీ జీవం వచ్చి వెంట్రకులు పెరుగుతాయి. ఈ పద్ధతి ద్వారా మీరు కోల్పోయిన జుట్టు కంటే మరింత ఎక్కువ జుట్టు అతి తక్కువ సమయంలో తిరిగి పొందవచ్చు. పైగా ఈ మూడు పదార్థాలు కూడా ఇంట్లోనే సులభంగా లభించేవే. అందుకే వీటి బాగా నూసి ధ్రవ రూపంలో చేసుకొని తాగాలి. చాలా తక్కువ ఖర్చుతో ఈ మూడు లభిస్తాయి కాబట్టి అందరికీ ఈ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
చాలా మంది ఇలాంటి ప్రకృతి సిద్ధమైన చిట్కాలు తెలియక కెమికల్స్ తో కూడిన షాంపూలు, సీరమ్ లు , ఇతర కాస్మొటిక్స్ ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ఆంగ్ల రసాయన మందులేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు కదా పైగా చాలా ఖర్చుతో కూడికున్నవి.
Also Read: డైలీ ఉదయన్నే ఈ పనులు చేస్తే.. రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు
అందుకే అల్లం, కరివేపాకు, ఉసిరి ఈ మూడు పదార్థాలు కలిసి జుట్టు రాలడాన్ని నిరోధించడమే కాకుండా, కొత్త జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి. ఇవి వెంట్రుకల మూలాలను బలపరిచి, జుట్టు రాలకుండా కాపాడతాయి.
తయారీ విధానం: ఈ నేచురల్ జ్యూస్ తయారు చేయడం చాలా సులభం. కొన్ని తాజా కరివేపాకులు, చిన్న అల్లం ముక్క, రెండు ఉసిరికాయలను తీసుకుని.. ఉసిరి గింజలను తీసి మిగతా పదార్థాలను చిన్న ముక్కలుగా కోయాలి. ఆ ముక్కలు, కరివేపాకు, అల్లం మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు కలిపి, జ్యూస్ లా చేయాలి. ఈ జ్యూస్‌ను ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ పొట్టతో తాగాలి. ఈ జ్యూస్ జుట్టు పెరిగే విధంగా సహాయపడే కాకుండా, మీ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అందువల్ల, ఖాళీ పొట్టతో తాగడం ద్వారా ఇది మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది.
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే, ఇందులో విటమిన్ A, విటమిన్ B, విటమిన్ C కూడా ఉండటం వల్ల అవి జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. అదేవిధంగా, ఇందులో ఐరన్, క్యాల్షియం వంటి మూలకాల వల్ల జుట్టు రాలిపోవడం అడ్డుకుంటుంది. హెయిర్ పోలికల్స్ పునరుజ్జీవం పొందేందుకు సహాయపడుతుంది.
ఉసిరి కూడా జుట్టు పెరుగుదలకు భారీ తోడ్పడుతుంది. ఉసిరిలో అయితే విపరీతమైన పోషకాలున్నాయి. విటమిన్ సి ఉన్న పవర్ హౌస్ ఉసిరి. ఇది తలపై ఉన్న మాడుని కాపాడుతుంది. చుండ్రు సమస్యను అరికడుతుంది. ఫలితంగా వెంట్రుకల కుదుళ్లు బలపడతాయి.
ఇక అల్లంలో యాంటీ ఇన్లమెంటరీ గుణాలు ఉండటం వల్ల, జుట్టు కుదుళ్లలో రక్తప్రసరణను పెంచి ఇది చుండ్రును అడ్డుకుంటుంది. ఫలితంగా జుట్టు మళ్లీ పెరుగుతుంది. ఈ మూడింటిని కలిసి జ్యూస్ లాగా చేసుకొని తాగడం లేదా మెత్తని పేస్ట్ లాగా చేసి దాన్ని తలపై కుదుళ్ల వరకు అంటిస్తే.. మంచి ఫలితాలు ఉంటాయి. తలపై పేస్ట్ పూస్తే దాన్ని 30 నిమిషాలు పెట్టుకొని తలస్నానం చేయండి.