
Gorantla Madhav Hot Comments: వైసీసీ బస్సు యాత్రలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం చంద్రబాబుపై ఘాటుగా కామెంట్స్ చేశారు. 2024 ఎన్నికల్లోపు చంద్రబాబు చస్తారంటూ వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపింది.
2024లో జగన్ సీఎం అవడం ఖాయమని..ఆ లోపు చంద్రబాబు చావడం కూడా ఖాయమని, ఇది తన గ్యారంటీ అంటూ బహిరంగ సభలో ఎంపీ మాధవ్ మాట్లాడిన మాటలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. సాక్షాత్తు ఓ ఎంపీ అయ్యి ఉండి.. ఈ విధంగా మాజీ సీఎంపై మాట్లాడటం పై విమర్శలు వెలువెత్తుతున్నాయి.
చంద్రబాబుపై ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మండిపడింది. కిషోర్ కుమార్ రెడ్డి, బొజ్జల సుధీర్ రెడ్డి, చల్లా బాబు ఎంపీ మాటల్ని ఖండించారు. గోరంట్ల మాధవ్‌కు సమాజంలో ఉండే అర్హత లేదన్నారు. ఇలాంటి వ్యక్తి ఎంపీ పదవికి అర్హుడు కాదన్నారు.
చంద్రబాబును జైళ్లోనే చంపేందుకు కుట్ర చేస్తున్నారని గతంలోనే నారా లోకేష్ అన్నారు. ఇప్పుడు మాధవ్ చేసిన కామెంట్స్ లోకేశ్ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.