BigTV English

Gorantla madhav: ట్రెండింగ్: ఆడోళ్లకి అక్క కాదు మొగోళ్లకి బావ కాదు

Gorantla madhav: ట్రెండింగ్: ఆడోళ్లకి అక్క కాదు మొగోళ్లకి బావ కాదు

జగన్ పై వచ్చిన విమర్శలకు కౌంటర్లిచ్చే క్రమంలో వైసీపీ నేతలు అక్కడక్కడా నోరు జారుతున్నారు. దానికి తాజా ఉదాహరణ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. మంత్రి లోకేష్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ కి జడ్ కేటగిరీ భద్రత ఎందుకని ప్రశ్నించారు. ఆయన ఆడోళ్లకి అక్క కాదు మొగోళ్లకి బావ కాదు అని అన్నారు. మరి దీనిపై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందా. ఇలాంటి మాటలన్నందుకు వైసీపీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.


వివాదాస్పద నేత..
గోరంట్ల మాధవ్ మొదట్నుంచి వివాదాస్పద నేతగా పేరు తెచ్చుకున్నారు. పోలీస్ గా ఉన్నప్పుడు కూడా ఆయన వివాదాస్పద ప్రెస్ మీట్ పెట్టి, ఆ తర్వాత వైసీపీలో చేరి ఎంపీగా గెలిచారు. కియా ప్రతినిధులతో ఆయన దురుసుగా ప్రవర్తించడంతోపాటు.. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకెక్కేవారు గోరంట్ల. గత ఎన్నికల్లో న్యూడ్ వీడియో వ్యవహారంతో పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇక ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు ఆపలేదు. 2024లో జగన్ సీఎం కావడం గ్యారెంటీ, చంద్రబాబు చావడం గ్యారెంటీ అని బహిరంగ సభలోనే మాట్లాడారు గోరంట్ల మాధవ్. తాజాగా పోలీసుల బట్టలూడదీస్తానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకునే క్రమంలో మరోసారి గోరంట్ల టంగ్ స్లిప్ అయ్యారు.

పోలీస్ లపై కూడా..
ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ పై కూడా గోరంట్ల మాధవ్ విమర్శలతో విరుచుకుపడ్డారు. గతంలో తాను ఓ పోలీస్ ఆఫీసర్ అనే స్పృహ కూడా లేకుండా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు నెటిజన్లు. “బాడ్కోవ్ కి బారాణా, మాల్ ఓనర్ కి చారాణా అన్నట్టుగా పోలీస్ డిపార్ట్ మెంట్ ఉంద”న్నారు గోరంట్ల మాధవ్. జగన్ రాప్తాడు పర్యటనలో పోలీస్ సెక్యూరిటీ సరిగా లేదన్నారు. సెక్యూరిటీ పేరుతో సిబ్బందిని పిలిపించి, టీడీపీ నేతల ఇళ్లకు కాపలా పెట్టుకున్నారని చెప్పారు.


జగన్ పై కుట్ర..!
జగన్ పై దాడికి కుట్ర జరిగే అవకాశం ఉందని కూడా గోరంట్ల మాధవ్ అనుమానం వ్యక్తం చేశారు. ఏపీలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత మాజీ సీఎం జగన్ అని, ఇంటెలిజెన్స్ సంస్థల రిపోర్టుల ప్రకారం అత్యధిక థ్రెట్ ఉన్న నేత కూడా ఆయనేనని చెప్పారు. జగన్‌ కు మూడంచెల భద్రత అవసరం అన్నారు. రాష్ట్రంలో జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా వేలాదిగా అభిమానులు వస్తున్నారని చెప్పారు. వారిని అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు గోరంట్ల మాధవ్.

టీడీపీ ట్రోలింగ్..
జగన్ గొప్పదనాన్ని వివరించే క్రమంలో మంత్రి నారా లోకేష్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటున్నారు టీడీపీ నేతలు. లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇలాగే వదిలేస్తే వైసీపీ నేతలు మరింత రెచ్చిపోతారని అంటున్నారు. చేబ్రోలు కిరణ్ ని టీడీపీ సస్పెండ్ చేసినట్టే, వైసీపీ కూడా గోరంట్ల మాధవ్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాకపోయినా, మరో ఘటనలో పోలీసులు వెంటనే గోరంట్ల మాధవ్ ని అదుపులోకి తీసుకోవడం విశేషం. చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించడమే కాకుండా, పోలీసుల విధుల్ని అడ్డగించారనే కారణంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×