Roof collapse In Dominican Republic: డొమినికన్ రిపబ్లిక్ లో అత్యంత ఘోర ప్రమాదం జరిగింది. ఆ దేశ రాజధాని శాంటో డొమింగోలోని నైట్ క్లబ్ పై కప్పు కూలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 218 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా శిథిలాల క్రితం చాలా మంది చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
మ్యూజికల్ ఈవెంట్ జరుగుతుండగా ప్రమాదం
శాంటో డొమింగోలోని జెట్ సెట్ క్లబ్ లో ప్రముఖ గాయకుడు రూబీ పెరెజ్ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మ్యూజిక్ లవర్స్ పాల్గొన్నారు. అంతేకాదు, పలువురు రాజకీయ నాయకులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రారంభం అయిన కాసేపటికే భవనం పైకప్పు అదిరినట్లు అయ్యింది. కాసేపటి తర్వాత నెమ్మదిగా పౌడర్ రాలడం మొదలయ్యింది. అయితే, కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనాలు ఉండటంతో పెద్దగా పట్టించుకోలేదు. మ్యూజిక్ శబ్దానికి భవనం అదరడంతో ఒక్కసారిగా పైకప్పు కుప్పకూలింది. పెద్ద సంఖ్యలో జనాలు శిథిలాలకిందే చిక్కుకుపోయారు. స్పాట్ లోనే 200 మందికి పైగా మృతి చెందారు. మృతుల్లో మురాంగే గాయకుడు రూబీ పెరెజ్ సైతం ఉన్నారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. భారీ క్రేన్లు, బుల్డోజర్లతో కలిపి శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 218 మంది చనిపోగా మరో 200 పైగా మంది గాయపడ్డారు. వీరిని పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశాధినేత ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలను ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Read Also: సుంకాలపై వెనుకడుగు వేసిన ట్రంప్.. చైనా మినహా అన్ని దేశాలకు ఊరట
డొమినికన్ రిపబ్లిక్ చరిత్రలోనే ఘోర ప్రమాదం
డొమినికన్ రిపబ్లిక్ చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదంగా స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాద సమయంలో క్లబ్ లో మొత్తం 1000 మందికి పైగా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మిగతావారిని బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ లో పెద్ద సంఖ్యలో సహాయక బృందాలు పాల్గొంటున్నాయి. స్పాట్ లోనే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పదుల సంఖ్యలో అంబులెన్సులను ఉంచారు. శిథిలా కింది నుంచి బయటపడిన వారిని వెంటనే అంబులెన్సులలో అక్కడి నుంచి హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read Aso: విదేశీ విద్యార్థులపై పగబట్టిన ట్రంప్.. ఏ తప్పుచేయకపోయినా చర్యలు