Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. అది కూడ ఏకంగా రూ. 10 కోట్లు కానుక అంటూ వైసీపీకి సవాల్ విసిరారు. దీనితో ఈ కానుక ఎందుకు, ఏమిటి అంటూ క్యాడర్ మొత్తం ఆరా తీస్తోందట. రాజకీయ విమర్శలకు ఇటీవల పదును పెట్టిన లోకేష్.. వైసీపీకి ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు ట్రెండీగా మారింది. ఇదే ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది.
మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో లోకేష్ చిట్ చాట్ గా మాట్లాడారు. ఇక్కడే లోకేష్ ఓ సంచలన కామెంట్స్ చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగిందని వైసీపీ ఆరోపిస్తుంది కదా అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనితో లోకేష్ చిరునవ్వులు చిందిస్తూ.. తాము గతంలో అధికారంలో ఉన్న సమయంలో డేటా చోరీ జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ, అధికారంలోకి రాగానే ఎందుకు నిరూపించలేక పోయిందని ప్రశ్నించారు.
అప్పటికే దొంగ కేసులు నమోదు చేసి అధికారం ఉంది కదా అని, చంద్రబాబును 52 రోజులు జైలులో పెట్టలేదా అంటూ లోకేష్ అన్నారు. టీడీపీ హయాంలో తాను ఐటీ మంత్రిగా ఉన్నానని, తన హయాంలో డేటా చోరీ జరిగి ఉంటే ఊరికే వదిలిపెట్టేవారా అంటూ లోకేష్ అన్నారు. ఇలా లోకేష్ విమర్శలు సాగించగా.. చివరగా వైసీపీకి ఓ కానుక ప్రకటించారు.
డేటా చోరీ జరిగిందని ఆరోపించే వైసీపీ నాయకులకు నారా లోకేష్ ఓ ఛాలెంజ్ విసిరారు. ఎక్కడైనా డేటా పూరి జరిగిందని నిరూపిస్తే ఏకంగా రూ. 10 కోట్లు కానుకగా ఇస్తానని, అదికూడా ప్రభుత్వం తరఫున కాకుండా వ్యక్తిగతంగా తానే చెక్ ఇస్తానంటూ లోకేష్ ప్రకటించారు. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాజీ సీఎం జగన్ కు ఎలా తెలుస్తుందని లోకేష్ ప్రశ్నించారు. జగన్ కు అసలు ఫోనే లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారని, అటువంటప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ గురించి తెలిసే అవకాశం లేదంటే లోకేష్ చెప్పారు.
Also Read: Bandla Ganesh : పవన్‌ను అంటే ఊరుకోను… సింగనమల రమేష్‌కు బండ్ల వార్నింగ్
ప్రస్తుతం లోకేష్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. డేటా చోరీ జరిగిందని ఆరోపించే వారు.. ముందు ఆధారాలు చూపాలని లోకేష్ అనడంతో, వైసీపీకి దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చారని టీడీపీ క్యాడర్ అంటోంది, మరి లోకేష్ చేసిన కామెంట్స్ కి వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో మున్ముందు తెలిసే అవకాశం ఉంది.