BigTV English

AP Assembly Dissolution : ఏపీ అసెంబ్లీ రద్దు.. గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్

AP Assembly Dissolution : ఏపీ అసెంబ్లీ రద్దు.. గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్

AP Assembly Dissolution : ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ.. గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేయగా.. దానిని గవర్నర్ ఆమోదించారు. జగన్ రాజీనామాతో ఆంధ్రప్రదేశ్ శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 9న అమరావతిలో సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 9న ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో గ్రాండ్ విజయం సాధించిన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్, బాలకృష్ణ తదితరులకు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీల హీరోలంతా నెట్టింట శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు.

హీరో రామ్‌ చరణ్‌ బాబాయ్‌ పవన్ గెలుపుపై ఆనందం వ్యక్తం చేశాడు. మా కుటుంబానికి గర్వకారణమైన రోజు.. మీ అద్భుతమైన విజయానికి నా అభినందనలు మై పవన్ కళ్యాణ్‌ గారూ!” అంటూ X వేదికగా ట్వీట్ చేశాడు.


పిఠాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సినీ నటుడు వెంకటేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘చారిత్రక విజయం సాధించిన ప్రియమైన పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు. ఈ విజయానికి నీవు సంపూర్ణ అర్హుడివి. ఇదే ఉత్సాహంతో ఉన్నతస్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నా. పిఠాపురం ఎమ్మెల్యేగారికి మరోసారి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు.

చంద్రబాబుకు హీరో కళ్యాణ్ రామ్ శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబు మావయ్యకీ తన హృదయపూర్వక అభినందనలు అని ఆయన ట్వీట్ చేశారు. మీ కృషి, పట్టుదల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నా అన్నారు. అలాగే మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపారు.

Tags

Related News

Women Health Camps: సెప్టెంబ‌ర్ 18 నుంచి.. మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు..!

AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కొత్త మలుపు.. ఐదు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు, వైసీపీలో గుబులు

Temple Stampedes: ఆలయాల్లో తొక్కిసలాట ఘటనలు.. ఆ ఎస్పీని టార్గెట్ చేసుకున్న వైసీపి.. ప్రభుత్వం ఘాటు రిప్లై!

AP Mega DSC 2025: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు షాక్.. నియామక పత్రాల పంపిణీ వాయిదా

AP Assembly: అసెంబ్లీ సమావేశాలు.. మండలిలో యూరియా సెగ, పలుమార్లు సభ వాయిదా

AP Railways: ఏపీలో కొత్తగా 11 రైల్వే లైన్లు.. 26 ప్రాజెక్టులు, ఆ శాఖ గ్రీన్ సిగ్నల్

Amaravati News: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు‌పై ఉత్కంఠ, సాయంత్రం నిర్ణయం?

Anchor Shyamala: ఏం చెప్పారు శ్యామలగారు.. భూమనను మించిపోయారుగా!

Big Stories

×