Guntur Crime News: ఇన్సూరెన్స్ రెన్యువల్ కోసం వెళ్ళిన ఓ కస్టమర్ ఏకంగా అక్కడి అధికారిపై దాడికి పాల్పడ్డాడు. దీనితో ఆ అధికారికి తీవ్రగాయాలు కాగా, వెంటనే వైద్యశాలకు తరలించారు పోలీసులు. గుంటూరులోని అరండల్ పేటలో మంగళవారం ఈ ఘటన జరగగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరులోని అరండల్ పేటలో గల కేర్ ఇన్సూరెన్స్ కార్యాలయానికి వచ్చిన ఓ కస్టమర్, ఇన్సూరెన్స్ రెన్యువల్ విషయంలో ఆపరేషన్ హెడ్ ను సంప్రదించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపాన్ని నియంత్రించుకోలేక పోయిన కస్టమర్ కత్తితో ఆపరేషన్ హెడ్ పై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావమైన హెడ్ ను చూసి భయాందోళనకు గురైన సిబ్బంది, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు
Also Read: Street Food: స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా? ప్రాణాలు పోతాయ్.. హెచ్చరిస్తున్న డాక్టర్స్
పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆయనను వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కస్టమర్ ముందుగానే దాడికి పాల్పడాలన్న ఆలోచనతో కత్తి తెచ్చుకున్నారా.. లేక కార్యాలయంలో అందుబాటులో ఉన్న కత్తితో దాడికి పాల్పడ్డారా అన్నది తేలాల్సి ఉంది. దాడికి పాల్పడే స్థాయిలో వీరి మధ్య వాదన ఏ విషయంపై సాగిందో కూడా పోలీసులు విచారిస్తున్నారు.