Harish Kumar Gupta: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త డిజీపీ నియమితులయ్యారు. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. హరీష్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్‌కి ఐపీఎస్ అధికారి. గత ఎన్నికల ముందు ఆయనను ఈసీ డీజీ నియమించింది. పలు జిల్లాలకు ఆయన ఎస్సీగా కూడా పని చేశారు.
ప్రస్తుతం హరీష్ కుమార్ గుప్తా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీగా పనిచేస్తున్నారు. ఆయన రెండో సారి డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం ట్రాన్స్ ఫర్ చేసిన విషయం తెలిసిందే. ఆ టైమ్‌లోనే హరీష్ కుమార్ గుప్తాను ఈసీ డీజీపీగా నియమించింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా కొంత కాలం ఆయన డీజీపీగా పని చేశారు.
ప్రస్తుతం ఉన్న ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవికి విరమణ చేయనున్నారు. డీజీపీ పదవికి సంబంధించి సీనియారిటీ జాబితా ప్రకారం 1991 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ప్రతాప్ రెడ్డి ముందు స్థానంలో ఉన్నారు. ప్రస్తుత అగ్నిమాపక శాఖ డీజీగా ఆయన పని చేస్తున్నారు. అయితే.. ప్రతాప్ రెడ్డి వైఎస్ కుటుంబానికి విధేయుడు అన్నట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించుకున్నట్లు టాక్ కూడా నడుస్తోంది. అందుకే జగన్ ప్రభుత్వంలోనే ప్రతాప్ రెడ్డిపై చర్యలు తీసుకున్నారు. ఈ కారణంగానే ఆయనను పేరును పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది.
Also Read: Relationship Manager Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో HDFCలో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
ప్రతాప్ రెడ్డి తర్వాత సీనియర్ ఆఫీసర్ అయిన ద్వారకా తిరుమల రావు డీజీపీ పదవిలోకి రాకుండానే రిటైరయ్యే పరిస్థితులు ఏర్పడడంతో ఇరువురికి అవకాశం కల్పించేలా సీఎం చంద్రబాబు నాయుడు హరీష్ కుమార్ గుప్తా ప్లేస్‌లో తిరుమల రావుకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తిరుమల రావు రిటైర్ కావడంతో మళ్లీ హరీష్ కుమార్ గుప్తాకు సీఎం అవకాశం ఇచ్చారు.. డీజీపీగా ప్రస్తుతమున్న ద్వారకా తిరుమలరావును పదవీ విరమణ అనంతరం ఆర్టీసీ ఎండీగా కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుుతం తిరుమల రావు డీజీపీగా ఉంటూనే ఆర్టీసీ ఎండీగా పని చేస్తున్నారు.