Rain Alert: ఏపీకి తుఫాన్ గండం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాన్ ప్రభావంతో నాలుగు రోజుల పాటూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. దక్షిణ బంగాళాఖాతంలో చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం ఏర్పడింది. ఈ వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారుతోందని వాతావరణశాఖ అంచనావేస్తోంది. రాబోయే రెండు రోజుల్లో శ్రీలంక, తమిళనాడు తీరానికి దగ్గరలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్రలోని దక్షిణ కోస్తా ప్రాంతంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రేపటి నుండి భారీ నుండి తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Also read: 19 మందిని హత్యాచారం చేశాడు.. ఇతని టార్గెట్ వారే.. సీరియల్ కిల్లర్ అరెస్ట్.. రియల్ క్రైమ్ స్టోరీ!
ముఖ్యంగా నెల్లూరు, తిరుపతిలో 26వ తేదీ నుండి ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. 27, 28వ తేదీల్లో నెల్లూరు, ప్రకాశం, తిరుపతిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 29వ తేదీన నెల్లూరు, ప్రకాశం, చిత్తూరుతో పాటూ ఉత్తర కోస్తా ఆంధ్రలోని శ్రీకాకులం, విజయనగరం జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గాలులు తీవ్రతరం అవుతున్నందున మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
55 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు భారీ గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు అసలు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. రైతులు కూడా పంటలను రక్షించుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ సూచించింది. ఈ నెల 29 ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వాయుగుండం కారణంగా ప్రధాని పర్యటన కూడా రద్దు చేసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది.