Daku Maharaj: గత కొన్నేళ్లుగా కేవలం రాజకీయ రంగంలోనే కాకుండా, మరోవైపు సినీ రంగంలో కూడా మంచి ఫామ్ లో ఉన్నారు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ ను చూసే విధానం వేరు. ఈ రోజుల్లో నందమూరి బాలకృష్ణను చూసే విధానం వేరు. ఆహాలో ప్రసారమైన అన్ స్టాటబుల్ షో తర్వాత నందమూరి బాలకృష్ణను చూసిన విధానం పూర్తిగా మారిపోయింది. బాలయ్య ఒరిజినల్ క్యారెక్టర్ ఆ షో చూసిన తర్వాత చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది. గతంలో పూరి జగన్నాథ్ లాంటివాళ్ళు కూడా బాలయ్య గురించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే పూరి బాలయ్యతో సినిమా చేశాడు కాబట్టి అలా చెబుతున్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ కొంతమందితో బాలయ్య మాట్లాడే విధానం. ముఖ్యంగా యంగ్ హీరోస్ ని కలుపుకునే విధానం ఇవన్నీ కూడా ఆ షోలో విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ షో తర్వాత హ్యాట్రిక్ హిట్ సినిమాలను అందుకున్నారు బాలయ్య.
Also Read : Balakrishna : బాలయ్య సంక్రాంతి సినిమాలు.. ఎన్ని హిట్ అయ్యాయో తెలుసా..?
ఇక ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కూడా సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. సీనియర్ హీరో చిరంజీవితో వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత బాబి చేస్తున్న సినిమా ఇది. ఇంక నందమూరి బాలకృష్ణతో ఏ స్థాయి హిట్ అందుకుంటాడు బాబి (Directory Bobby) అని చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి తమన్ (Thaman S) సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన ఈ సినిమాను నాగ వంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుక ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమరావతిలో భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
Also Read : Siddharth on Pushpa Movie: పుష్ప సినిమాపై హీరో సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్
అమరావతిలో ఈవెంట్ ప్లాన్ చేస్తే సినిమాకి బాగా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. మామూలుగా హైదరాబాద్లో ఈవెంట్ చేయడం అనేది కామన్ గా జరుగుతూ వస్తుంది. కొన్నిసార్లు ఇక్కడ పర్మిషన్ కూడా దొరుకుతుంది అని గ్యారెంటీ లేదు. కానీ అమరావతిలో మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలుగా బాలయ్యకు ఖచ్చితంగా సహకరిస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా మీద మాత్రం చిత్ర యూనిట్ విపరీతమైన నమ్మకంతో ఉంది. బాబీ బాలకృష్ణ ని చూపించిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంటుంది.