BigTV English

MLA Nandamuri Balakrishna: ఆర్టీసీ బస్సు డ్రైవర్ గా మారిన నందమూరి బాలకృష్ణ

MLA Nandamuri Balakrishna: ఆర్టీసీ బస్సు డ్రైవర్ గా మారిన నందమూరి బాలకృష్ణ

MLA Nandamuri Balakrishna news(Political news in AP): నందమూరి బాలకృష్ణ ఏం చేసినా సంచలనమే..అటు సినిమాలు, ఇటు రాజకీయాలలోనూ హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు. ఆరుపదులు దాటినీ ఇప్పటికీ యంగ్ హీరోలకు ఇన్ స్పిరేషన్ గా నిలుస్తున్నారు. రియాలిటీ షోలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటిదాకా అన్ని జానర్లలో చేసిన అరుదైన హీరోలలో బాలకృష్ణ ఒకరు. జానపద, పౌరాణిక, సాంఘీక చిత్రాలు ఏవైనా బాలయ్య మాత్రమే చెయ్యగలడు అని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో ఇంకా పేరు ఫిక్స్ చేయని సినిమా లో చేస్తున్నారు. బాలయ్య నటించిన 109వ చిత్రం అది. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరో పక్క బోయపాటి కాంబినేషన్ లో అఖండ మూవీ సీక్వెల్ కూడా ఉండబోతోందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.


హ్యాట్రిక్ విజయాలతో..

రాజకీయాలలోనూ అఖండ విజయాలు సొంతం చేసుకుంటున్నారు బాలయ్య. హిందూపురం నియోజకవర్గం నుంచి మూడో సారి గెలుపొందారు బాలయ్య. రాష్ట్రమంతా జగన్ హవా నడిచిన సందర్భంలోనూ హిందూపురం నుంచి బాలయ్య గెలుపొందడం విశేషం. ఆయనకున్న క్రేజ్ అలాంటిది. అయితే ఏనాడూ తాను చెయ్యిచాచి పదవులు అడగలేదు. పదవులకు దూరంగా ఉంటున్నారు. కావాలంటే డిప్యూటీ సీఎం కూడా అవ్వగలరు. కానీ తనకు వ్యక్తిగతంగా పదవులపై మోజు లేదంటారు ఆయన. ఇక హిందూపురం నియోజకవర్గం ప్రజలు బాలకృష్ణ అంటే ప్రాణం పెడతారు. బాలయ్య బాబు యావరేజ్ సినిమాలు కూడా అక్కడ వందరోజులు ఆడతాయంటే ఆయనకున్న క్రేజ్ ఏమిటో అర్థమవుతుంది. అందుకే బాలయ్య హిందూపురం నియోజకవర్ం కోసం అక్కడ ప్రాధమిక సౌకర్యాల కోసం ప్రజలకు అందుబాటులో ఉంటారు. రీసెంట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబును హిందూపురం అభివృద్ధి కోసం రూ.90 కోట్లు అడిగారు. అలాగే పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కూడా అభ్యర్థించారు. ఇక హిందూపురం జిల్లా కేంద్రంగా చేయాలని కూడా అడుగుతున్నారు.


నాడు లారీ డ్రైవర్ నేడు బస్సు డ్రైవర్

ఇప్పటికే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన బాలయ్య రీసెంట్ గా సత్యసాయి అనంతపురం జిల్లాలోని హిందూపురం పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరంభించారు. అయితే అంతటితో ఊరుకోలేదు. సరదాగా ఓ బస్సు స్టీరింగ్ పట్టుకుని నడిపించారు. అలా డ్రైవర్ పాత్రలో తమ అభిమాన హీరో కనిపించేసరికి హిందూపురం తెలుగుదేశం కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున బాలయ్యకు హర్షధ్వానాలు చేశారు. అప్పట్లో లారీ డ్రైవర్ సినిమాను గుర్తుచేసుకున్నారు. కొందరైతే సీనియర్ ఎన్టీఆర్ డ్రైవర్ రాముడు మూవీన గుర్తుచేసుకున్నారు. కాగా తమ ప్రాంతానికి కొత్తగా బస్సులు రావడంలో కృషి చేసిన బాలకృష్ణకు నియోజకవర్గ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఇదంతా బాలయ్య వలనే సాధ్యమయిందని తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలయ్య బస్సు  నడిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×