E-Paper
Advertisement

Niroshan Dickwella: అడ్డంగా దొరికిన క్రికెటర్, వేటు వేసిన శ్రీలంక బోర్డు

Niroshan Dickwella: అడ్డంగా దొరికిన క్రికెటర్,  వేటు వేసిన శ్రీలంక బోర్డు
Advertisement

Niroshan Dickwella: ఆటల్లో రాణించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు ఆటగాళ్లు. ఆట ఏదైనా తన టాలెంట్ నిరూపించుకోవడమే అసలు టార్గెట్. ఈ క్రమంలో చేయరాని తప్పులు చేసి అడ్డంగా దొరికి పోతున్నారు. తాజాగా క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లా డోపింగ్ టెస్టులో అడ్డంగా దొరికిపోయాడు. దీంతో శ్రీలంక బోర్డు అతడిపై వేటు వేసింది.

ఇటీవల లంక ప్రీమియర్ లీగ్-ఎన్‌పీఎస్ పోటీల సందర్భంగా ఆటగాళ్లకు డోపింగ్ టెస్టు నిర్వహించింది శ్రీలంక క్రికెట్ బోర్డు. అందులో లంక వికెట్ కీపర్- బ్యాట్స్‌మన్ నిరోషన్ డిక్వెల్లా అధిక మోతాదులో నిషిద్ద ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలింది. టెస్టులో అతడికి పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఈ క్రమంలో ఆటగాడిపై శ్రీలంక కోర్టు సస్పెన్షన్ విధించింది. ఈ మేరకు లంక బోర్డు ఓ ప్రకటన కూడా చేసింది.

Advertisement

31 ఏళ్ల క్రికెటర్ చివరిసారిగా గతేడాది మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌లో ఆడాడుకానీ, సరైన ప్రదర్శన చేయలేక పోయాడు. సస్పెన్షన్ తక్షణమే అమలులోకి వచ్చింది. తదుపరి నోటీసు వచ్చేవరకు అలాగే కొనసాగ నుందని లంక మీడియా తెలిపింది. 2021లో ఇంగ్లాండ్ టూర్‌లో సెక్యూరిటీ ఉల్లంఘించాడు. దీంతో  డిక్వెల్లాను సస్పెండ్ చేసింది.

ALSO READ: కోర్టు తీర్పుపై భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌ వైరల్ పోస్ట్

Advertisement

నిరోషన్ డిక్వెల్లా ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్‌లో గాలే మార్వెల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తన కెరీర్‌లో 54 టెస్టులు (సగటు-2757 పరుగులు), 55 వన్డేలు (1604 పరుగులు), 28 టీ-20 మ్యాచ్‌ (480 పరుగులు)లు ఆడాడు. వన్డేల్లో రెండు సెంచరీలు, టెస్టుల్లో 20కి పైగానే హాఫ్ సెంచరీలున్నాయి. గతేడాది ఆ దేశ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

Related News

పాకిస్తాన్ ప‌రువు తీసిన శుభ్‌మన్ గిల్…అంద‌రూ క‌లిసి చేసిన ర‌న్స్ ఒక్క‌డే చేశాడుగా!

పాకిస్తాన్ ను నాశ‌నం చేసింది మైక్ హెసనే..వాడు కూడా ఇండియ‌న్ ఏజెంటే !

పీక‌ల‌దాకా తాగుతూ నైట్ క్ల‌బ్ లో దొరికిన 9 మంది పాకిస్తాన్ క్రికెట‌ర్లు

125 స్పీడ్ తో బౌలింగ్ చేస్తే, నా ఆస్తులు రాసిస్తా… బ్రెట్ లీకి షోయ‌బ్ అక్త‌ర్ స‌వాల్

నా చేత‌కాని త‌నం వ‌ల్లే.. ఆ క్యాచ్ నేల పాలైంది – మాలిక్

పాకిస్తాన్ జ‌ట్టు నుంచి పిలుపు..అంత‌లోనే ఫోన్ స్విచ్ ఆఫ్, పాస్ పోర్టు లేదు..కానీ కట్ చేస్తే

శార్దుల్ ఠాకూర్ కు బౌలింగ్ వ‌ద్ద‌ని మొత్తుకున్నా ధోని విన‌లేదు – హ‌ర్భ‌జ‌న్

వైభ‌వ్ సూర్య‌వంశీ మాములోడు కాదు.. లిఫ్ట్ లోనే అమ్మాయితో రొమాన్స్ ?

Big Stories

Advertisement
×