E-Paper
Advertisement

కల్వర్టులో దూసుకెళ్లిన ట్రావెల్ బస్సు, స్పాట్‌లో 20 మంది ప్రయాణికులు, అనంతపురంలో రోడ్డు ప్రమాదం

కల్వర్టులో దూసుకెళ్లిన ట్రావెల్ బస్సు, స్పాట్‌లో 20 మంది ప్రయాణికులు, అనంతపురంలో రోడ్డు ప్రమాదం
Advertisement

Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న లారీ – ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో రెండు కల్వర్టు నుంచి కింద పడ్డాయి. ప్రమాదం సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 20 మందికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. అసలు ఘటన ఎలా జరిగింది?

 

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

 

అనంతపురం జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పామిడి మండలం పొగరు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ లారీని ఢీ కొని కల్వర్టులో బోల్తా పడింది ట్రావెల్ బస్సు. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. అందులో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన గురించి తెలియగానే పోలీసులు, అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి.

Advertisement

 

ట్రావెల్ బస్సు-లారీ ఢీ, కల్వర్టులోకి దూసుకెళ్లిన వాహనాలు

 

క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తోంది లారీ. అయితే ఆదివారం ఉదయం పొగరు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ఢీ కొట్టింది. ఈ ఘటనతో వాహనాలు కల్వర్టులోకి పడిపోయాయి. ఘటన గురించి తెలియగానే స్థానికులు డ్రైవర్లను బయటకు తీశారు. అతి వేగం, నిద్ర మత్తు ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

 

ట్రావెల్ బస్సులో 20 మంది ప్రయాణికులకు గాయాలు

 

ఘటన సమయంలో బస్సులు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. జరిగిన ప్రమాదం గురించి పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తోంది? ప్రయాణికుల గురించి ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

ALSO READ: శ్రీకాకుళంలో జగన్ పర్యటన.. ఎస్ఐపై దాడి చేసిన చింతాడ రవి అరెస్ట్ 

Related News

బాబు వెన్నుపోట్లను గడపగడపకూ తీసుకెళ్లండి.. జగన్ హాట్ కామెంట్స్!

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

Big Stories

Advertisement
×