E-Paper
Advertisement

టీమిండియా క్రికెట‌ర్లు పెద్ద దొంగ‌లు..గాయాల పేరుతో జారుకున్న 9 మంది ?

టీమిండియా క్రికెట‌ర్లు పెద్ద దొంగ‌లు..గాయాల పేరుతో జారుకున్న 9 మంది ?
Advertisement

Trolls On Team India Injuries: టీమిండియా క్రికెట్ జట్టులో ప్రస్తుతం గాయాల బెడద కొనసాగుతోంది. వరుసగా కీలక ప్లేయర్ లందరూ గాయాల బారిన పడుతున్నారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు చాలా మంది ఇండియన్ క్రికెటర్లు షెడ్డుకు వెళ్లారు. ఏదో ఒక గాయం పేరుతో అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా స్కిప్ అయిపోతున్నారు. అయితే దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ టోర్నమెంట్ ఉన్నప్పుడు గాయాలు కానీ ఆటగాళ్లకు.. అంతర్జాతీయ క్రికెట్ ఆడేటప్పుడే ఎందుకు గాయాలు అవుతున్నాయని ప్రశ్నిస్తున్నారు క్రికెట్ అభిమానులు. కావాలని టీమ్ ఇండియా క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా… గాయాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికిప్పుడు ఐపీఎల్ పెడితే గాయాల బారిన పడ్డ తొమ్మిది మంది క్రికెటర్లు.. ఐసీయూ నుంచి లేచి వచ్చి, మ్యాచ్ లు ఆడతారని పరువు తీస్తున్నారు. ఈ దద్ద‌మ్మ‌లు ఐపీఎల్ త‌ప్ప‌, టీమిండియా ఎప్పుడూ ఆడ‌లేద‌ని ఆగ్ర‌హిస్త‌న్నారు.

9 మంది టీమిండియా క్రికెట‌ర్ల‌కు గాయాలు

2026 టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి ఇప్పటివరకు టీమిండియా జట్టును గాయాలు వేధిస్తూనే ఉన్నాయి. ఆ టోర్నమెంట్ ఫినిష్ అయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా , బుమ్రా గాయాల బారిన పడ్డారు. ఇటీవల కాలంలో బుమ్రా కోలుకొని ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాడు. కానీ అంతలోనే మూడవ వన్డే సందర్భంగా గాయం తిరగబడిందని.. మళ్లీ ఇంటిదారి పట్టాడు. చాలా తెలివిగా శ్రీలంక టెస్ట్ సిరీస్ ను తప్పించుకున్నాడని అతనిపై విమర్శలు కూడా వస్తున్నాయి.

Advertisement

Major Gaurav Arya On Pak: పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

అటు హర్షిత్ రాణాకు హామ్‌స్ట్రింగ్ గాయం చోటు చేసుకుంది. హార్దిక్ పాండ్యాకు క్వాడ్రిసెప్స్, బుమ్రాకు మోకాలి వాపు, నితీష్ రెడ్డికి హామ్‌స్ట్రింగ్ గాయాలు అయ్యాయి. వాసింగ్ట‌న్ సుందర్ కు క్వాడ్రిసెప్స్, ఆకాశ్ దీప్ కు నడుము కింది భాగంలో నొప్పి చోటు చేసుకుంది. సాయి సుదర్శన్ కు కాలి వేలు విరిగింది. శుభ్‌మన్ గిల్ కు లంక‌లో కుడి చేతి ఉంగరపు వేలికి గాయం అయింది. వరుణ్ చ‌క్ర‌వ‌ర్తికి హ‌ర్షిత్ రాణా లాగానే హామ్‌స్ట్రింగ్ గాయం అయింది. ఇలా మొత్తం 9 మంది కీల‌క ఆట‌గాళ్లు గాయాల‌తో పోరాడుతూనే ఉన్నారు.

Advertisement

Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

పొద్దున్నే ఐపీఎల్ నిర్వ‌హిస్తే.. ICU నుంచి వ‌చ్చి ఆడ‌తారు

గాయాలతో బాధపడుతున్న 9 మంది క్రికెటర్ల పై అదే సమయంలో ట్రోలింగ్ కూడా జరుగుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ రేపు పొద్దున ప్రారంభిస్తే… గాయపడ్డ తొమ్మిది మంది క్రికెటర్లు మళ్లీ కోల్కుంటారని సెటైర్లు పెంచుతున్నారు. ICU బెడ్డుపై ఉన్న క్రికెటర్లు కూడా ఐపీఎల్ ఆడేందుకు పరిగెత్తుకుంటూ వస్తారని చురకలు అంటిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ అంటే మాత్రం పారిపోతున్నారని నిప్పులు చెరుగుతున్నారు. దీనిపై బీసీసీఐ కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తరచూ టీమిండియా క్రికెటర్లు ఎందుకు గాయాల బారిన పడుతున్నారనే దానిపైన ఫోకస్ చేయాలని కోరుతున్నారు. లేకపోతే 2027 వన్డే వరల్డ్ కప్ టీమ్ ఇండియా గెలవడం కష్టమేనన్నారు.

 

Related News

జపాన్‌‌ను ఓడించేందుకే కింద మీద పడ్డారు..మీరు పాకిస్తాన్ వెంట్రుక కూడా పీకలేరు

ఆ ఇద్దరూ దరిద్రుల వల్ల, నాకు నిద్ర లేకుండా పోయింది…గంభీర్ కామెంట్స్ వైరల్

నీ కోసం ప్రైవేట్ జెట్ పంపిస్తా… మార్క్ వుడ్ కు ఐపీఎల్ ఓన‌ర్ క‌ళ్లు చెదిరే ఆఫర్

విదేశాల్లో ఒక్క‌ ఐపీఎల్ మ్యాచ్‌ పెట్టండి..టీమిండియా ప్లేయ‌ర్ల‌ భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది

ఆ రోజు జెర్సీ విడిచినందుకు, నా కూతురే అవ‌మానించింది…గంగూలీ ఎమోష‌న‌ల్

బాబర్ ఆజం మ‌గాడే కాదు, పెద్ద మాడా గాడు… వాడి కంటే, ఫాతిమా సనా 200% బెటర్

బీసీసీఐ త‌ల‌తిక్క నిర్ణ‌యాల‌ వ‌ల్లే… అభిషేక్ శర్మ, వైభవ్ కెరీర్ నాశ‌నం అవుతోంది!

ఏషియన్ గేమ్స్ లో టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టి, ఘోరంగా ఓడిస్తాం

Big Stories

Advertisement
×