E-Paper
Advertisement

CBN : ఇంకెంత కాలం బాబును టార్గెట్ చేస్తారు?

CBN : ఇంకెంత కాలం బాబును టార్గెట్ చేస్తారు?
Advertisement

ఏపీ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఆగడం లేదు. ప్రభుత్వం అనేది ఒక పెద్ద వ్యవస్థ..రాజకీయ నాయకులను ప్రజలే తమ పాలకులుగా ఎన్నుకుంటారు.వారందరికీ ఒక సుప్రీం (ముఖ్యమంత్రి)ముందుండి నడిపిస్తుంటారు. వీరంతా ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. అయితే, పాలకులే నేరుగా పనిచేయకుండా అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో పనులు చేయిస్తుంటారు. అన్నిరంగాల్లో ఇదే సిస్టమ్ అమలవుతూ వస్తుంటుంది. అయితే,కిందిస్థాయిలో ఎవరైనా వ్యక్తి సరిగా పనిచేయకపోయినా, నిధులు దుర్వినియోగం చేసినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా అతనిపైనున్న బాస్‌లు యాక్షన్ తీసుకోవాలి.ఈ సిస్టమ్ మీదే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి. కాగా, కింది స్థాయిలో ఎవరైనా వ్యక్తి తప్పు చేస్తే అతనిపైనున్న వారిని కాకుండా నేరుగా సీఎంనే ప్రశ్నించడం, దూషించడం సమంజసమేనా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఘటన ఏదైనా..

ఇటీవల రాష్ట్రంలో కల్తీ పాల ఘటన, క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుడు వంటి ఘటనలు వెలుగుచూడగా ప్రతిపక్ష నేతలు నేరుగా సీఎం చంద్రబాబును విమర్శించడం మొదలెట్టారు. అదే విధంగా సీఎం చంద్రబాబును దూషించిన ఘటనలో మాజీ మంత్రుల ఇంటిమీద దాడులు జరిగిన సమయంలోనూ ఆయన్నే కార్నర్ చేశారు. ఈ ఘటనలకు ముఖ్యమంత్రికి ప్రత్యక్షంగా, పరోక్ష్యంగా గానీ ఏం సంబంధం? కల్తీ పాల ఘటనలో బాధితులను ప్రభుత్వమే ఆదుకున్నది. ఆస్పత్రిలో చికిత్స, నష్టపరిహారం అందజేసింది. కల్తీ చేసి అమ్మాలని సర్కారు ఏమైనా చెప్పిందా? లేదు కదా? ఇదే విషయాన్ని తెలుగు దేశం పార్టీ నేతలు గర్తుచేస్తున్నారు. జరిగింది ఒక ప్రమాదంలా భావించకుండా, ప్రభుత్వ నిర్లక్ష్యం, చంద్రబాబు వల్లే జరిగిందని చెప్పడం ఎంతవరకూ కరెక్టు? అని ప్రశ్నలు సంధిస్తున్నారు పలువురు.

అప్పుల భారంపైనా..

Advertisement

గత వైసీపీ ప్రభుత్వం కేవలం ఐదేండ్ల పాలనలో ఇష్టానుసారంగా అప్పులు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని సరిచేస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నారు. గత ప్రభుత్వం ఎక్కడెక్కడ అప్పులు తెచ్చిందో వారికి వడ్డీతో సహా చెల్లిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేక.. కేంద్రాన్ని సాయం కోరడం, రుణాలు తీసుకుని ప్రజాసంక్షేమం, అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కూటమి సర్కార్ నడుం బిగించింది. ఈ విషయం తెలిసినా సీఎం చంద్రబాబు పాలన వల్లే రాష్ట్రం మీద అప్పుల భారం పెరుగుతున్నదని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నట్టు కూటమి నేతలు మండిపడుతున్నారు.

YSRCP Strategy: 2029 లక్ష్యంగా జగన్ కొత్త స్ట్రాటజీ.. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా?

ఇంకెంతకాలం..

Advertisement

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో సంభవించిన విపత్తలు, ప్రమాదాలు, ఆర్థిక ఇబ్బందులు, సంక్షేమ ఫలాల అందజేతలో ఆలస్యం ఇలా ప్రతి అంశాన్ని ప్రతిపక్ష వైసీపీ టార్గెట్ చేసింది. సీఎం చంద్రబాబు, ప్రభుత్వ నిర్లక్షం వల్లే రాష్ట్రంలో పాలన కుంటు పడుతున్నదని, నేరాలు పెరిగాయని, పెట్టుబడులు, రాబడులు తగ్గాయని వైసీపీ అధినేత విమర్శలు చేస్తున్నారు. ఇదే విషయంపై తెలుగు తమ్ముళ్లు సైతం గరం అవుతున్నారు. వ్యక్తులు చేసిన తప్పులకు, ప్రకృతి వైపరీత్యాలకు సీఎం చంద్రబాబుకు ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. మొక్కుబడికి విమర్శించకుండా ఏదైనా సందర్భానుగుణంగా,నిజంగానే ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడం లేదని ప్రజలు రోడ్డెక్కిన సమయంలో ప్రశ్నించినా, విమర్శించినా ఒక విలువ ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×